అక్రమంగా వీసాల అమ్మకం: వలసదారుడికి డిపోర్టేషన్
- May 23, 2017
కతర్: ఆసియాకి చెందిన ఓ వ్యక్తి, అక్రమంగా బిజినెస్ వీసాల్ని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న నేరానికి, న్యాయస్థానం అతన్ని దేశం నుంచి బహిష్కరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అలాగే, 20,000 ఖతారీ రియాల్స్ జరీమానా కూడా విధించింది న్యాయస్థానం. బిజినెస్ వీసాల్ని అక్రమంగా విక్రయిస్తూ, ఒక్కో వీసాపై 1,000 ఖతారీ రియాల్స్ కమిషన్ పొందుతున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించడం జరిగింది. ఒక్కో వీసా 20,000 ఖతారీ రియాల్స్‌కి మొత్తం 20 వీసాల్ని విక్రయించాడు నిందితుడు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులపై ఆరోపణల్ని న్యాయస్థానం తిరస్కరించింది. వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ లభించకపోవడంతో ఆ ముగ్గురికీ ఊరట దొరికినట్లయ్యింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









