పీవీ సింధు, ఇండోనేషియాపై ఇరగదీసింది
- May 23, 2017
- 4-1తో భారత్ ఘన విజయం
- సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్
సుదిర్మన్ కప్‌లో టీమ్ ఇండియా గొప్పగా పుంజుకున్నది. డెన్మార్క్ చేతిలో తొలి మ్యాచ్‌లో ఓడినా, మాజీ చాంపియన్ ఇండోనేషియాపై మెరుపు విజయంతో రేసులో నిలిచింది. స్టార్ షట్లర్ పి.వి సింధు మరోసారి జట్టును ముందుండి నడిపించటంతో భారత్ 4-1తో ఇండోనేషియాపై ఘన విజయం సాధించింది. నేడు డెన్మార్క్, ఇండోనేషియా పోరులో డెన్మార్క్ నెగ్గితే గ్రూప్1డి నుంచి భారత్, డెన్మార్క్‌లు క్వార్టర్స్‌కు చేరుకుంటాయి. ఇండోనేషియా నెగ్గితే మాత్రం గేమ్ రికార్డు ప్రకారం మెరుగైన జట్టు క్వార్టర్స్‌కు చేరుకుంటుంది. మిక్స్‌డ్ డబుల్స్‌తో మొదలెట్టిన భారత్, మహిళల డబుల్స్‌తో మ్యాచ్‌ను ముగించింది. సాత్విక్ సాయి రెడ్డి, అశ్విని పొన్నప్పలు 22-20, 17-21, 21-19తో గెలుపొందారు. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ 21-15, 2116తో జొనాథన్ క్రిస్టెపై వరుస గేముల్లో గెలుపొందాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయి రెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ 9-21, 17-21తో పోరాడి ఓడింది.
ఇక మహిళల సింగిల్స్‌లో పి.వి సింధు 21-8, 21-18తో ఫిట్రానిపై ఏకపక్ష విజయం నమోదు చేయగా 3-1తో అప్పటికే భారత్ గెలుపు ఖాయం చేసుకున్నది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జంట 21-12, 21-19తో గెలుపొంది భారత్ ఆధిక్యాన్ని 4-1కు తీసుకెళ్లారు. సుదిర్మన్ టీమ్ చాంపియన్‌షిప్ టోర్నీలో భారత్ కేవలం ఒక్కసారి మాత్రమే క్వార్టర్స్‌కు చేరుకున్నది. గత రెండు సీజన్లుగా టీమ్ ఇండియా గ్రూప్ దశ నుంచే నిష్క్రమిస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







