ఐస్ దాడులు గురించి ముందే చెప్పినా వినని బ్రిటిష్ ప్రభుత్వం
- May 24, 2017
ఓ చిన్న నిర్లక్షం ఖరీదు కొన్ని వందలమంది ప్రాణం ఖరీదు.. కొన్నికుటుంబాల ఘోష.. ప్రస్తుతం బ్రిటిష్ ప్రభుత్వం చేసిన నిర్లక్షం.. తాజాగా జరిగిన మాంచెస్టర్ దాడి.. అవును ఉగ్రవాదుల పై పరిశోధనలు చేసే న్యాయవాది మాక్స్ హిల్ .. మాంచెస్టర్ దాడిని ముందే ఊహించి.. ఐఎస్ అంతం కాలేదని.. మళ్ళీ విజృంభిస్తుందని చెప్పారు.. బ్రిటన్ చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.. కానీ ఆయన మాటలు ఎవరు లెక్కచెయ్యలేదు.. ఇక బ్రిటన్ ప్రభుత్వం అసలు ఆయన మాటలను పరిగణలోకి కూడా తీసుకోలేదు.. కారణం... రెండు నెలల కిందట ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాది స్లామిక్ స్టేట్ ఓటమి పాలయ్యిందంటూ స్వయంగా ప్రకటించాడు. అంతేకాదు ఐఎస్ ఉగ్రవాదులందరూ ఆత్మహత్య చేసుకోవాలని కూడా వీడ్కోలు ప్రసంగం చేశాడు. దీంతో ఐఎస్ అంతమైందని బ్రిటన్ భావించింది. కాగా ఇదే సమయంలో మాక్స్ హిల్ ఐఎస్ లోని భిన్నకోణాన్ని ఆవిష్కరించాడు. అది అంతం కాలేదని.. అదను చూసి ఎటాక్ చేస్తుందని చెబుతూనే ఉన్నాడు. దృష్టి మళ్లించేందుకే బాగ్దాదీ ఈ ప్రకటన చేశారని హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ ఎవరూ నమ్మలేదు. ఇంతలోనే ఐఎస్ భీకర దాడికి తెగబడింది. మాక్స్ హిల్ మాటలను నిజం చేసింది. ఈయన గతంలోనే ఇరాక్.. సిరియాల్లో చావుదెబ్బ తిన్న ఇస్లామిక్ స్టేట్.. అప్పుడే బ్రిటన్ను టార్గెట్ చేసుకుందని, ప్రపంచం దృష్టిని మళ్లించేందుకే బాగ్దాదీ వీడ్కోలు ప్రకటన చేశాడని వివరించాడు. ఐఎస్ ఇకపై చేయబోయే దాడులు కొత్త తరహాలో ఉంటాయని వెల్లడించాడు. అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకున్న ఇస్లామిక్ స్టేట్.. వెస్ట్ లండన్ పేలుళ్లకంటే కూడా తీవ్రమైన దాడులకు ప్లాన్ చేస్తోందని తెలిపాడు. కానీ బ్రిటన్ ప్రభుత్వం అతని మాటలు పట్టించుకోలేదు.. నిఘావర్గాలను అప్రమత్తం చేయలేదు.. నిఘావర్గాలు కనుక పనిచేసి ఉంటే.. ఐఎస్ దాడి ప్లాన్‌ను పటాపంచలు చేసి ఉండేవారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- కొత్తగా ప్రపోజ్ చేస్తానని పిలిచి.. బెంగుళూరులో ఘోరం
- టాలీవుడ్లో విషాదం..చిట్టిబాబు కన్నుమూత
- వైభవంగా కేదార్నాథ్ ఆలయ పునఃప్రారంభం..
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!









