రమదాన్ పునస్కరించుకొని ప్రైవేట్ రంగంలో రోజుకు ఆరు గంటల పని
- May 24, 2017
పవిత్ర మాసం రమదాన్ సందర్భంగా ప్రైవేటు రంగ కంపెనీలు, కార్పొరేషన్ లు కార్మిక చట్టంలో భాగంగా, ఆరు పని గంటల తగ్గింపునకు కట్టుబడి ఉండాలని అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ అండ్ సోషల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంటూ రమదాన్ కాలం లో 6 గంటల పనిని అమలు చేయడంలో సంస్థలపై పర్యవేక్షక పాత్రను ధృవీకరించింది. అదేవిధంగా, మంత్రిత్వశాఖ యొక్క తనిఖీ అధికారుల నియమావళిని అమలు చేయడానికి తగిన సూచనలను ఇచ్చింది. వీరు సైట్లు మరియు వివిధ కంపెనీలకు చెందిన పని స్ధలాలు పరిశీలించేందుకు వివిధ పర్యటనలు నిర్వహిస్తారు. సంబంధిత సంస్థలలో పనిగంటలు అమలు విషయంలో ఏదైనా ఉల్లంఘనలను అమలు చేయడంలో పొరబాట్లు జరిగితే చట్టపరమైన ప్రక్రియలు తీసుకోబడతాయి. అంతేకాకుండా, మంత్రివర్గం , వివిధ కమ్యూనికేషన్ ఛానల్ మరియు హాట్ లైన్ ద్వారా కార్మికుల పనిగంటలు అమలు విషయంపై వివిధ ఫిర్యాదులను తీసుకొంటుంది. అటువంటి సమాచారం ఇచ్చిన కార్మికుల హక్కులను కాపాడడానికి కఠినమైన గోప్యతతో వ్యవహరించబడుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి: సీఎం రేవంత్
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం
- రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్‌పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్‌కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్‌లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!









