గల్ఫ్ బాధితుల గోడు విందాం
- October 08, 2015
గల్ఫ్ పనికోసం వీసా ఇప్పిస్తామని పర్యాటక వీసా (విజిటింగ్ వీసా) ఇస్తారు. ఇది తెలియక పరాయి దేశంలో అడుగుపెట్టాక అసలు కష్టాలు మొదలవుతాయి. ఇక్కడ విమానం ఎక్కే వరకు దుబాయ్‌లో ఇళ్లు, దుకాణాలు, కంపెనీల్లో హెల్పర్ లేదా డ్రైవర్ పనికి పంపిస్తున్నామంటారు. గల్ఫ్‌లో దిగాక తీసుకెళ్లేందుకు అకామా (వీసా) ఇచ్చినవాళ్లు రారు.గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న వారిలో అత్యధిక మందిని గొర్రెలు, ఒంటెలు కాయడానికి, షేక్‌ల వ్యవసాయ క్షేత్రంలో పనివాళ్లుగా ఉపయోగించుకుంటారు. అక్కడ వీరి జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు పరిస్థితుల వల్ల తెలంగాణ పల్లెలు అతలాకుతమయ్యాయి. ఆ సమయంలోనే గల్ఫ్ దేశాల్లో కూలీల అవసరం ఏర్పడింది. బతుకుదెరువు లేని రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లారు.
గల్ఫ్ తో సహా 17 ఈసీఆర్ (ఎమిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వయిర్డ్) దేశాల్లో సుమారు 60 లక్షల మంది భారతీయ వలస కార్మికులు పనిచేస్తున్నట్టు ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో తెలంగాణకు చెందిన దాదాపు పది లక్షల మంది ఉన్నట్టు అంచనా. గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న వారిలో యాభై శాతం మంది కార్మికులు 18 నుంచి 30 ఏళ్ల లోపు వారే. ఇందులో ఎక్కువ శాతం మంది పదోతరగతిలోపు చదువుకున్న వారే. గల్ఫ్ దేశాల వలసలపై అధ్యయనం చేసిన ఒక స్వచ్ఛంద సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.
ఇమిగ్రేషన్ చట్టం-1983 ప్రకారం అధికారిక లైసెన్స్ కలిగిన ఏజెంట్లు సేవా పన్నుగా 45 రోజుల వేతనాన్ని 20 వేలకు మించకుండా తీసుకోవాలి. కానీ అధికమంది ఏజెంట్లు డ్బ్భై వేల నుంచి లక్షా యాభై వేల వరకు తీసుకుంటున్నారు. వీరు గ్రామాల వారీగా సబ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని గల్ఫ్ వెళ్లేందుకు ఒక మనిషిని తీసుకొస్తే సబ్ ఏజెంట్‌కు ఐదు వేల నుంచి పదిహేను వేల వరకు ముట్టజెప్తున్నారు. అలాగే దళారుల మోసాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. గల్ఫ్‌లో దిగగానే అక్కడి దళారీ వచ్చి వీళ్లను తీసుకెళ్తాడు. వీరికి ఇచ్చే పాస్‌పోర్టులు, వీసాల్లో అనేక మోసాలుంటాయి. పనికోసం వీసా ఇప్పిస్తామని పర్యాటక వీసా (విజిటింగ్ వీసా) ఇస్తారు. ఇది తెలియక పరాయి దేశంలో అడుగుపెట్టాక అసలు కష్టాలు మొదలవుతాయి. ఇక్కడ విమానం ఎక్కే వరకు దుబాయ్‌లో ఇళ్లు, దుకాణాలు, కంపెనీల్లో హెల్పర్ లేదా డ్రైవర్ పనికి పంపిస్తున్నామంటారు.
గల్ఫ్ లో దిగాక వీరిని తీసుకెళ్లేందుకు (వీసా) ఇచ్చినవాళ్లు రారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న వారిలో అత్యధిక మందిని గొర్రెలు, ఒంటెలు కాయడానికి, షేక్‌ల వ్యవసాయ క్షేత్రంలో పనివాళ్లుగా ఉపయోగించుకుంటారు. అక్కడ వీరి జీవితాలు చాలా దుర్భరంగా ఉంటా యి. వీరికి ఇచ్చే జీతం చాలా తక్కువ. లేబర్ క్యాంపుల్లో ఒక్క గదిలో 10-20 మంది వరకు కార్మికులు ఉంటారు. వీరికి అక్కడ తినడానికి రొట్టెలు పంపిస్తున్నారు.
వారం పాటు అవే తినాలి. అన్నం, కూర తినే అలవాటు ఉన్న మనవాళ్లకు అక్కడి తిండి సహించదు. దీంతో పనిచేసే సమయంలో అలసిపోతుంటారు. అంతేకాదు తాగుదామంటే మంచినీళ్లు కూడా కరువే. తమ బంధువులతో మాట్లాడటానికి చాలాచోట్ల వారానికి ఒకసారి అవకాశమిస్తుంటారు. ఇలా నిత్యం కన్నీళ్లను, అవమానాలను దిగమింగుకుంటూ బతుకులీడుస్తుంటారు. గల్ఫ్ బాధితులు వేసవిలో 50 డిగ్రీలు దాటే ఎండ, చలికాలంలో ఎముకలు కొరికే చలిలో పనిచేస్తూ నరకం అనుభవిస్తుంటారు. వాతావరణ పరిస్థితులపై అవగాహన లేక చాలామంది మృత్యువాత పడుతుంటారు.
బోగస్ వీసా, గ్రూపు వీసా, విజిటింగ్ వీసాపై గల్ఫ్ వెళ్లిన వారికి సరైన ఉపాధి దొరకదు. కంపెనీ జీతం సరిగా ఇవ్వకుండానో, లేక మధ్యలోనే కంపెనీ మూతపడితేనో, అలాగే జీతం సరిపోక దొంగచాటుగా ఏదో పనిచేసుకుంటూ బతుకుతుంటారు. వీసాలేకుండా అక్రమంగా గల్ఫ్ దేశాల్లో ఉన్నవాళ్లను బైటికి పంపడానికి ఆయా దేశాలు నాలుగైదు ఏళ్లకొకసారి ఔట్‌పాస్ పెడుతాయి. అప్పుడు వీసాలు లేనివాళ్లెవరైనా లొంగిపోవాలని పత్రికాప్రకటనలు ఇస్తుంది. స్వచ్ఛందంగా లొంగితేపోతే నెలరోజుల పాటు జైళ్లో పెడతారు. ఆ తర్వాత వారిని ఎంబసీ ద్వారా స్వదేశానికి పంపిస్తారు. పోలీసుల దాడుల్లో దొరికి జైళ్లలో ఉన్న వాళ్ల పరిస్థితి మరీ దారుణం. వాళ్లు జైల్లో ఉన్నట్టు బంధువులెవరైనా తెలుసుకొని టికెట్లు కొని విడుదలకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తారు.
లేకపోతే ఎన్నేైళ్లెనా అంతే సంగతులు. ఇలా రాష్ర్టానికి చెందిన ఎంతోమంది వలస కార్మికులు జైళ్లలో మగ్గిపోతున్నారు. యూఏఈ ప్రభుత్వం ఇప్పటికి నాలుగుసార్లు అమ్నెస్టి ప్రకటించింది. 2007లో అత్యధికంగా నలభై వేల మంది ఒకేసారి తిరిగి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అప్పుల బాధతో మానసిక ైస్థెర్యాన్ని కోల్పోయి దాదాపు 150 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గల్ఫ్ వలస కార్మికుల సమస్య తీవ్రత ప్రపంచానికి తెలిసింది.
గల్ఫ్ వెళ్లే వారి కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు:
1) ఇమిగ్రేషన్ యాక్ట్-1983 ప్రకారం విదేశీ వలసలను నియంత్రించాలి. ఇందుకు అవసరమైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి.
2) తెలంగాణలో ప్రత్యేకంగా ప్రవాసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.
3) ఎన్‌ఆర్‌ఐ సెల్ లాంటి సంస్థలను బలోపేతం చేయాలి. అందులో పూర్తిస్థాయి ఉద్యోగులను నియమించి ఏజెంట్ల పాత్రను తగ్గించాలి. గల్ఫ్‌కు వలసవెళ్తున్న కులీల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించాలి. దీని ఆధారంగా వలస కార్మికుల సంక్షేమానికి పటిష్ట ప్రణాళికలను రూపొందించవచ్చు.
4) ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాష్ట్ర, జిల్లా, మండలస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలి. అక్కడి చట్టాలపై సమగ్రమైన అవగాహన కల్పించాలి.
5) కేరళ, గుజరాత్ రాష్ర్టాల వలె తెలంగాణ రాష్ట్రం గల్ఫ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి.
6) వివిధ కేసులతో విదేశీ జైళ్లలో మగ్గుతున్న ప్రవాస కార్మికులకు ఉచిత న్యాయ సహాయం అందించి, వారిని విడిపించేందుకు కృషి చేయాలి.
7) గల్ఫ్ కార్మికులు సామాజిక మాధ్యమాలను వాడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వారి సమస్యలను తెలుసుకోవాలి.
8) కార్మికుల ఆరోగ్య సమస్యల కోసం ప్రత్యేక చర్యలుచేపట్టాలి.
--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







