నెట్ కనెక్షన్ లేకుండానే ఇన్ స్టెంట్ మెసేజింగ్
- October 08, 2015
ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ అయిన హైక్ మెసెంజర్ వాడాలంటే ఫోన్లో ఇంటర్ నెట్ కనెక్షన్ ఉండాలి కదూ.. కానీ ఇప్పుడు ఇంటర్ నెట్ కనెక్షన్ లేకుండానే దాన్ని వాడుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. తమకు దాదాపు 7 కోట్లమంది యూజర్లు ఉన్నారని, కానీ ఇప్పటికీ దేశంలో చాలామంది స్మార్ట్ ఫోన్ వాడకందారులకు ఇంటర్ నెట్ కనెక్షన్ ఉండట్లేదని, అందుకే తాము ఇంటర్ నెట్ అవసరం లేకుండానే తమ యాప్ ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నామని హైక్ మెసెంజర్ వ్యవస్థాపకుడు, సీఈవో కవిన్ భారతి మిట్టల్ తెలిపారు. వై-ఫై, మొబైల్ డేటా ఏవీ లేకుండానే ఫొటోలు, స్టిక్కర్లు, ఫైళ్లు, మెసేజిలను ఇతర హైక్ మెసెంజర్ వాడకం దారులకు పంపుకోవచ్చని ఆయన వివరించారు. 70 ఎంబీ పరిమాణంలో ఉండే పెద్ద ఫైళ్లను కూడా కేవలం 10 సెకండ్లలోనే పంపేయొచ్చన్నారు. ఏడాదికి దాదాపు నూరు శాతం చొప్పున వృద్ధిరేటు తమ యాప్ కు ఉంటోందన్నారు. ప్రస్తుతం నెలకు 2వేల కోట్ల మెసేజిలు పంపుతున్నారని, వారానికి కనీసం 140 నిమిషాలు ఈ యాప్ మీద గడుపుతున్నారని చెప్పారు. ఇటీవలే వందమంది యూజర్లతో కాన్ఫరెన్స్ కాల్ చేసుకునే అవకాశాన్ని కూడా హైక్ మెసెంజర్ కల్పించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







