గుణశేఖర్ సినిమాకు పన్ను మినహాయింపు
- October 08, 2015
ఎన్నో వాయిదాల తరువాత అక్టోబర్ 9న రిలీజ్ కు రెడీ అవుతన్న ప్రతిష్టాత్మక చిత్రం 'రుద్రమదేవి'కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సాయం అందుతోంది. ఓరుగల్లు వీరనారి రుద్రమదేవి కథగా తెరకెక్కిన ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. చిత్ర దర్శకనిర్మాత గుణశేఖర్ తో పాటు, నిర్మాత దిల్ రాజు గురువారం కేసీఆర్ ను కలిసిన నేపథ్యంలో ఈ మేరకు హామి ఇచ్చారు. గుణశేఖర్, రుద్రమదేవి సినిమా చూడాల్సిందిగా కేసీఆర్ ను ఆహ్వానించారు. కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందిస్తూ తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందన్నారు. రుద్రమదేవిగా అనుష్క నటిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. తన సొంత నిర్మాణ సంస్థ గుణ టీం వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







