రవితేజ కొత్త సినిమా 'టచ్ చేసి చూడు'

- May 25, 2017 , by Maagulf
రవితేజ కొత్త సినిమా 'టచ్ చేసి చూడు'

రవితేజ స్పీడ్‌ పెంచారు. ఆ మధ్య నటనకి కొంత విరామం ఇచ్చిన ఆయన ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో కొత్త దర్శకుడు విక్రమ్‌ సిరికొండ దర్శకత్వం వహిస్తున్న 'టచ్ చేసి చూడు' చిత్రం ఒకటి. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బేనరుపై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్ కపూర్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ వచ్చే నెల 5న ప్రారంభం కానుంది. 20 రోజుల పాటు హైదరాబాద్‌, పాండిచ్చేరిలో జరిగే షూటింగ్‌లో కీలక సన్నివేశాలు, ఒక ఫైట్‌, ఛేజ్‌ చిత్రీకరిస్తామని నిర్మాతలు చెప్పారు. డిఫరెంట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రవితేజ తన అభిమానుల్ని అలరించే అద్భుతమైన పాత్రను పోషిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com