సౌదీ అరేబియాలో ఆంధ్ర మహిళకు కష్టాలు
- May 25, 2017
సౌదీ అరేబియా:సౌదీలోని ఓ ఇంట్లో పాచిపని చేసేందుకు వెళ్లిన మహిళ అక్కడ నరకయాతన అనుభవిస్తోంది. నెల్లూరు జిల్లా కావలి పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీకి చెందిన చౌటూరి కాంతమ్మ(55), స్థానిక ఏజెంటు షేక్ ఫయాజ్ ద్వారా 2016 సెప్టెంబరులో సౌదీ అరేబియాకు వెళ్లింది. రెండు నెలల తరువాత కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి యజమాని చిత్రహింసలు పెడుతున్నాడని తనను తిరిగి స్వదేశానికి పిలిపించాలని వేడుకుంది. దీంతో ఆవేదన చెందిన కుటుంబసభ్యులు, ఆమెను వెనక్కు పిలిపించడానికి ఖర్చుల నిమిత్తం ఏజెంట్‌కు రూ.80వేలు చెల్లించారు. కానీ ఆతడి నుంచి స్పందన లేకపోవడంతో వారంతా గురువారం కావలి డీఎస్పీ రాఘవరావును కలసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







