అనుష్క పెళ్ళికి బాటలు వేసిన నాగార్జున -అనుష్క ల రిలేషన్
- May 26, 2017
స్వీటి శెట్టి అలియాస్ అనుష్క శెట్టి... పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్ సినిమాతో 2005 లో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అరుంధతి సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిన జేజమ్మ అనుష్క ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. ఇక తాజా సినిమా బాహుబలి లో దేవసేన పాత్ర అనుష్క కు ఎనలేని గుర్తింపు దేశవ్యాప్తంగా దక్కించుకొన్నది. తాజాగా భాగమతి సినిమాలో నటిస్తున్న అనుష్క పెళ్లి వార్తలు గత కొంతకాలంగా హల్ చల్ చేస్తున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో అనుష్క వెండి తెరపై మంచి జోడీ.. దీంతో ఈ జంట ప్రేమించుకొంటున్నారు అని.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అని పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి. కాగా అనుష్క ఏ గుడికి వెళ్ళినా అక్కడ తన పెళ్లి కోసం ఈ 36ఏళ్ల భామ పూజలు చేస్తుంది అనే వార్తలు ప్రముఖంగా చోటు చేసుకొంటున్నాయి.. తాజాగా అనుష్క పెళ్లి పై మరో వార్త హల్ చల్ చేస్తోంది.. అనుష్క కు అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి మంచి రిలేషన్ ఉన్నది.. చైతు, అఖిల్ కు యోగా నేర్పించిన గురువుగా ఆ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితురాలు... ఇక నాగార్జున సినిమాల్లో అనుష్క కూడా ఏదొక చిన్న పాత్రలోనైనా కనిపించి రొమాన్స్ చేసింది.. కాగా తాజాగా నాగార్జున-అనుష్క ల మధ్య ఉన్న సంబంధం ఆమె పెళ్ళికి బాటలు వేసిందనే టాక్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తున్నాయి. అనుష్క కు నాగార్జున తనకు బాగా తెలుసున్న వ్యాపార వేత్తతో పెళ్లి కుదిర్చినట్లు... త్వరలో ఈ ప్రముఖ వ్యాపార వేత్తను అనుష్క పెళ్లి చేసుకొనున్నట్లు హాట్ హాట్ టాపిక్ గా వినిపిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







