నటి, దర్శకురాలు విజయనిర్మలకుడాక్టరేట్ ప్రదానం

- May 26, 2017 , by Maagulf
నటి, దర్శకురాలు విజయనిర్మలకుడాక్టరేట్ ప్రదానం

అలనాటి నటి, దర్శకురాలు విజయనిర్మలకు మరో గౌరవం దక్కింది. చిత్రపరిశ్రమలో ఆమె చేసిన సేవలకు గాను ఇప్పటికే ఎన్నో పురస్కారాలు, గిన్నిస్ బుక్ లో చోటుదక్కించుకున్న విజయనిర్మలకు యూకేకు చెందిన రాయల్ అకాడమీ ఆఫ్ గ్లోబల్ పీస్ సంస్థ... గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. హైదరాబాద్ నానక్ రాంగూడలోని కృష్ణ నివాసంలో రాయల్ అకాడమీ ప్రతినిధులతోపాటు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కూకట్ పల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ హాజరై గౌరవ డాక్టరేట్ తో విజయనిర్మలను సన్మానించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులతోపాటు పెద్దసంఖ్యలో అభిమానులు హాజరై కృష్ణ-విజయనిర్మల దంపతులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మభూషణ్ పురస్కారానికి విజయనిర్మల పేరును కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్లు మంత్రి తలసాని వెల్లడించారు. మహిళా దర్శకురాలిగా 47 చిత్రాలకు దర్శకత్వం వహించి 200 సినిమాల్లో నటించిన విజయనిర్మల... పరిశ్రమలో ఎనలేని సేవలందించారని కొనియాడారు. కృష్ణగారి పక్కన కూర్చొని డాక్టరేట్ అందుకోవడం ఎనలేని సంతోషాన్ని కలిగించిందని విజయనిర్మల ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు.
ఇలాంటి పురస్కారాలు తమలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com