నెలవంక మెరవడంతో ఉపవాస దీక్షలు ప్రారంభం
- May 26, 2017
దైనందిన జీవితాల్లో తెలుసో... తెలియకో... చేసిన పాపాల ప్రక్షాళన చేసుకోవడమే కాకుండా బోలెడన్ని పుణ్యాలు మూటకట్టుకునే అవకాశాన్ని అల్లా రంజాన్ రూపంలో తమకు ఇచ్చారని ముస్లీం సోదరులు బలంగా విశ్వసిస్తారు. ఈ నెలలో వచ్చే ఒక రాత్రి వెయ్యి రాత్రుల కంటే గొప్పది.. ఆ రోజే ఇస్లాం మతానికి దిశా నిర్దేశం చేసే ఖురాన్ అవతరించిందని రంజాన్ మాసం గురించి ఇస్లాం మత దేవదూత బిజ్రాయెల్ చెప్పిన మాటలు అవి... ఈ మాటలతోనే ఈ నెల ప్రత్యేకత ఎంత అనేది అర్థమవుతుంది. అందుకే ఈ నెలలో ముస్లీంలు ఉపవాసాలు, ఖురాన్ పఠనం, ఐదు పూటల నమాజ్, దానధర్మాలు చేయడంలోనే తమ జీవితాలలో పరమార్థం ఉన్నట్లు భావిస్తారు.
ముస్లీం సోదరులు ఎంతో భక్తి ప్రవత్తులతో ఉపవాసాలు (రోజా) చేసే రంజాన్ మాసం కోసం మసీదులు ముస్తాబయ్యాయి . వయస్సు బేధం లేకుండా ముస్లీంలు కఠిన నిబంధనలు పాటించే ముస్లీములు ఈ నెల అంత దాన, ధర్మాలకు ప్రతీకగా ఉంటారు. తెల్లవారుజామున సుమారు 5గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు అన్న పానియాలు ముట్టుకోరు. అర్హత ఉన్న ప్రతి ముస్లీం వ్యక్తి ఫిత్రా, జకాత్ రూపంలో పేదలకు దానధర్మాలు తప్పనిసరిగా చేస్తే ఉపవాసాలకు సార్థకత చేకూరుస్తూ ఉంటారు. . తెల్లవారుజామున రోజా చేస్తున్నానని సంకల్పం తీసుకున్న తరువాత సాయంత్రం 6:30 నుంచి 7గంటల మధ్యలో నిర్ణీత వేళల్లో ఇఫ్తార్ విందులు చేయడం విధిగా పాటించాలి. శరీరం సహకరింఎచక ఏదైనా ప్రాణాంతకంగా భావించినప్పుడు మాత్రం దేవుడా... ఈ ఆజ్ఞను శివసావహించినందుకు నన్ను క్షమించమని వేడుకొని ఉపవాసాలను ముగించాలని తప్పిపోయిన ఉపవాసాలన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని అల్లాకు ప్రీతి పవిత్రమైన ఈ రంజాన్ మాసాన్ని అతి పవిత్రంగా ముస్లీంలు భావిస్తారు. ఇస్లాం మతంలోని ఐదు ఇస్వాలు మూలస్తంభాలాంటివి. అందులో ఇస్లాం మతస్తులకు మూల విశ్వాసాలతో మూడవదైన రంజాన్ మాసం అల్లాకు ప్రీతి పాత్రమైందని ఖురాన్లో పేర్కొనబడింది. మహ్మద్ ప్రవక్త సందేశం ప్రకారం రోజు ఉపవాసం ఇస్లామియా సమాజంలో అనుభూతిని సమానత్వాన్ని స్థాపిస్తుంది. సహనాన్ని పెంపొందించడం, పేదవారు అనుభవించే ఆకలిదప్పులు ఎలా ఉండాయో తెలియజేయడం తోటి మానవులకు ఆదుకునే గుణాన్ని ప్రసాదిస్తుంది. అందుకే రంజాన్ సానుభూతి మాసమని ఎవరైతే ఈ నెల మొత్తం ఉపవాసాలు పాటించి సహాయం చేస్తారో దీనివల్ల ఏడాదిలో మిగితా మాసాల్లో ఇస్లాం మత పంచవిశ్వాలను ఆచరించిన వారితో సమానంగా పుణ్యఫలాన్ని అందుకుంటారని పవిత్ర గ్రంథాలైన ఖురాన్, హదీస్లలో పేర్కొనబడింది.
రోజాకు మినహాయింపు....
ప్రపంచిక విషయాలను తెలుసుకునే వయస్సు నుంచి వృద్ధాప్యం వరకు రోజా తీప్పకుండా చేయాలని ఇస్లాం మతం చూపుతుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు వ్యాధిగ్రస్తులు అయినప్పుడు, స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు, బిడ్డలకు పాలిచ్చే సమయంలో ఉపవాసాలను చేయాల్సిన అవసరం లేదు.
ఫిత్రా....
రంజాన్‌మాసంలో ఉపవాస వ్రతమైన వెంటనే ప్రతి ముస్లీం తప్పకుండా ఫిత్రా చేయాలి. అలా చేయకుంటే నెలంతా చేసిన ఉపవాసాలు వ్యర్థమవుతాయి. వాటి విలువ ధాన్యరూపంలో అయితే ఒక కిలో 750గ్రాముల బియ్యం, గోధుమలు లేకుంటే వాటి విలువకు సరైన డబ్బులను దానం చేయాలి.
జకాత్....
జకాత్ అంటే మనిషి సంపాదనలో కొంత భాగాన్ని ఆపదలో ఉన్న వారికి, నిరుపేదలకు దానం చేయడం. దీని ద్వారా సంపాదనపట్ల పరిశుద్ధత పొందడం అని అర్థం. ఇస్లాం మతంలో సమాజ్‌కు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో జకాత్‌కు అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఇది పేద వారికి సహకరించడానికి ప్రేరణ కలిగిస్తుండడం వల్ల రంజాన్‌లో జకాత్ చెల్లించడం తప్పనిసరిగా అయ్యింది.
జకాత్ పొందడానికి అర్హులు...
పూట గడవనివారు, పేదలు, ఫకీర్లు, ఆస్తిపాస్తులు లేనివారు జీవనోపాధి కోసం శ్రమించే శక్తి లేనివారు, వ్యాధిగ్రస్తులు, అనాథలు, వితంతువులు జకాత్ సొమ్ము స్వీకరించడానికి అర్హులు. అప్పులు తీర్చలేని రుణగ్రస్తులు, ఆస్తి ధ్వంసం అయిన వారు, అసాధారణ జరిమానా విధింపబడిన వారు దివాలా తీసిన వ్యాపారి, విపత్తు సంభవించి సర్వం కోల్పోయిన వారు, ఆపదల్లో చిక్కుకున్న వారు దీనికి అర్హులవుతారు. అవసరం ఉన్నప్పటికి అత్మాభిమానంతో చేయిచాపని (మిస్కిన్)లకు కూడా జకాత్ సొమ్మును దానం చేయవచ్చు.
ప్రారంభం కానున్న రంజాన్ మాసం...
ముస్లీంలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం శుక్రవారం సాయంత్రం నెలవంక మెరవడంతో శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా బందరు లోని అన్ని మసీదుల్లో ముస్లీంలు ప్రార్థనలు చేయడానికి సర్వంసిద్ధం చేసుకుంటున్నారు.
నోరూరించే హలీమ్...
ఉపవాసాలతో పాటు దీక్ష విరమించగానే పలు రకాల పండ్లు, వంటకాలు రంజాన్ మాసంలో నోరూరింపజేస్తాయి. ఇందులో హలీమ్ మొదటిస్థానంలో ఉండగా దహీ పేడాలకు ప్రత్యేకత ఉంది. మాంసం, నెయ్యి, గోధుమలు సమపాళ్లలో కలిపి సుగంధ దినుసులతో తయారయ్యే హలీమ్ రంజాన్ నెలలో ప్రత్యేకత. ఈ నెలలో ఖర్జురాలకు ప్రత్యేకత ఉంది. ఈ పండ్లను ఇస్లాం మతప్రవక్త అయిన మహ్మద్ సల్లెలాహూ అలైవసల్లం విరివిగా ఉపయోగించేవారు. అందుకే ఇప్పటి ఉపవాస దీక్షను విరమించే ఇఫ్తార్‌లో ఈ పండ్లు ఉండేటట్లు జాగ్రత్త తీసుకుంటారు
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









