రెండు తెలుగురాష్ట్రాల్లో అధికారపార్టీలకు బీజేపీ షాక్
- May 27, 2017
తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాలు పెంచేందుకు కేంద్రం వెనకాడుతుంది. తెలంగాణలో అధికారం కావాలంటే నియోజకవర్గాలు పెరగకుడదన్న నివేదికలతో వ్యూహం మార్చింది. ఇంతకీ అమిత్ షాకు నివేదికలు ఇచ్చిందెవరు? మరి ఏపీలో సీట్లు పెరగడానికి ఆస్కారం ఉందా? తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు లేనట్టేనా..అమిత్ షా అడ్డుపుల్ల వేశారా.. తెలుగు రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ అయింది. అధికార పార్టీలు పెట్టుకున్న ఆశలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నీళ్లు జల్లినట్టు ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం, TRS పార్టీలు నియోజకవర్గాల పెంపు కోసం ఒత్తిడి పెంచాయి. వెంకయ్యనాయుడు ద్వారా కేంద్రంలో ఫైల్ మూవ్ అయ్యేలా చేశారు. హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా నియోజకవర్గాల పెంపునకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సమావేశాల్లో బిల్లు సాధ్యం కాలేదని... వచ్చే సెషన్లో సాకారం చేస్తామని భరోసా ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. కానీ మారిన రాజకీయ సమీకరణలతో వ్యూహం మారింది. ప్రభుత్వం ఆలోచన ఒకలా ఉంటే... పార్టీ వ్యూహం మరోలా ఉంది. అమిత్ షా ఆదేశాలతో ఫైల్‌పై కేంద్రం పునరాలోచనలో పడింది. నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో లేనట్టేనని సంకేతాలు వస్తున్నాయి. దక్షణాదిలో విస్తరించాలన్న బీజేపీ తెలంగాణపై నజర్ పెట్టింది. అసెంబ్లీ పరంగా తక్కువ సీట్లు ఉంటేనే పార్టీకి కలిసి వస్తుందని.. పెరిగిన కొద్దీ భారమే అని రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన నివేదికలు ఇప్పటికే అమిత్‌షాకు అందాయట. దీంతో ఆయన కూడా సొంతంగా రిపోర్టులు తెప్పించుకున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. పార్టీ రాష్ట్ర కమిటీ నివేదికలతో ఆయన కూడా ఏకీభవించినట్టు తెలుస్తోంది. పైగా నియోజకవర్గాలు పెరిగితే సిటీలో MIM పార్టీ రెండెంకెలకు పరుగులు తీసే ప్రమాదముందని అమిత్‌షాకు ఆయన వేగులు సమాచారం ఇచ్చారట. తెలంగాణలో నియోజకవర్గాలను పెంచడానికి బీజేపీ నాయకత్వం ససేమిరా అంటోంది. అయితే కేవలం ఏపీలో మాత్రమే పెంచి.. తెలంగాణలో నిలిపివేయడం రాజకీయంగా విమర్శలకు తావిస్తుంది. పైగా విభజన చట్టప్రకారం సాధ్యం కూడా కాదు. దీంతో ఇరు రాష్ట్రాల్లో ఈసారికి డిలిమిటేషన్ లేనట్టేనని చెబుతున్నారు. నియోజకవర్గాల పెంపు అంశం కేంద్ర పరిధిలో ఉందని.. మేము వ్యతిరేకం కాదని బీజేపీ నాయకులు అంటున్నారు. కారణం ఏదైనా నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో సాధ్యంకాదన్న సంకేతాలు తెలుగు రాష్ట్రాల అధినేతలకు అందాయి. తెలంగాణ కోణంలోనే తమ ఆలోచనలు ఉన్నాయని.. దీనిపై సర్ధుకుపోవాలని ఏపీ సీఎం చంద్రబాబుకు అమిత్ షా చెప్పినట్టు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల ప్రధాన పార్టీలు, ఆశావహులు ఆశగా ఎదురుచేస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ఫైల్ కోల్డ్ స్టోరేజీకి చేరినట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే పార్లమెంట్ సెషన్లో దీనిపై మరింత క్లారిటీ వస్తుందంటున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









