600 కుటుంబాలకు ఆహార సాయం

- May 27, 2017 , by Maagulf
600 కుటుంబాలకు ఆహార సాయం

 లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ రిఫ్ఫా, రమదాన్‌ సందర్బంగా 600 కుటుంబాలకు ఫుడ్‌ ప్యాకెట్స్‌ని రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ ద్వారా అందించనుంది. మనామాలోని రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ - డిప్లమాటిక్‌ ఏరియాలో దీనికి సంబంధించిన కార్యక్రమం జరిగింది. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ రిఫ్ఫా - డొనేషన్‌ని రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీకి అందజేసింది. తదనంతరం రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ, బహ్రెయిన్‌లోని ఆయా కుటుంబాలకు వీటిని అందజేస్తుంది. గత 20 ఏళ్ళుగా పూర్‌ ఫ్యామిలీస్‌కి రిఫ్ఫా క్లబ్‌ పలు విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తోంది. సంస్థకు చెందిన సభ్యులు అందిస్తున్న వితరణ ద్వారా ఇది సాధ్యమవుతోంది. ఈ ఏడాది లయన్స్‌ క్లబ్‌ 7 టన్నులకు పైగా ఫుడ్‌ వాల్యూని అందించింది. వీటి విలువ 3000 బహ్రెయిన్‌ దినార్స్‌ కంటే ఎక్కువ. తమకు సోషల్‌ కమిటీ ఉందనీ, పూర్‌ ఫ్యామిలీస్‌ని స్టడీ చేసి, వారి అవసరాలకు తగ్గట్టుగా కొంతమేర వారిని ఆదుకునేందుకు సమాలోచనలు జరిపి, వారికి సాయం చేసే ప్రయత్నం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com