ఏయే నూనెలతో ఎలాంటి ప్రయోజనం
- May 27, 2017
1. నువ్వుల నూనె దంత ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయం పూట దీంతో చిగుళ్లను వేళ్లతో అద్ది రుద్దాలి. చిగుళ్ల ఆరోగ్యంగా, గట్టిగా ఉంటాయి. ఈ నూనెతో అలర్జీలు వస్తాయన్న భయం కూడా లేదు. దంతాలు తెల్లబడాలనుకునేవారు ఇలా కొబ్బరినూనెతోనూ ప్రయత్నించవచ్చు.
2. తలకి సంబంధించినంత వరకూ ఆముదం, భృంగరాజ్, ఆలివ్, కొబ్బరి, మందార నూనెలు మేలు చేస్తాయి. ఇవి జట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తాయి. వీటిని విడివిడిగా కానీ, కలిపికానీ వాడుకోవచ్చు. షాంపుతోపాటు ఇలా రెండుమూడు చక్కల నూనె వాడితే తలస్నానానికి కండిషనర్‌తో పనుండదు.
3. ఆముదం కనుబొమల అందానికి ఎంతో ఉపకరిస్తుంది. రెండుమూడు చుక్కల ఆముదాన్ని పట్టించి రాత్రంతా వదిలేయండి. ఇందులోని మాంసకృత్తులు కనుబొమలు ఒత్తుగా పెరిగేందుకు సహకరిస్తాయి. పాత మస్కారా బ్రష్‌ని ఆముదంలో ముంచి అద్దితే వెంట్రుకలు నల్లగా నిగనిగలాడతాయి.
4. యాక్నె వంటి సమస్యలుంటే టీట్రీ నూనె చక్కగా ఉపయోగపడుతుంది. ముఖంపై మచ్చలు పోవడానికి విటమిన్ 'ఇ' నూనె వాడటం మేలు. చేతివేళ్లు బాగా పొడిబారి తెగినట్లు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు గోళ్ల చుట్టూ ఉన్న చర్మంపైకి లేచి ఇబ్బందిపెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు బాదం నూనె రాస్తే అక్కడి చర్మానికి తేమ అంది ఆరోగ్యంగా మారుతుంది.
5. పాదాలు పొడిబారితే... ముందుగా గోరువెచ్చని నీటితో పాదాలు శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత రెండు చుక్కలు పెప్పర్‌మింట్ నూనె కలిపిన ఆలివ్ నూనె అరి పాదాలకు రాస్తే సమస్య తగ్గుతుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









