బెంగళూరులో వర్షం భీభత్సం..
- May 28, 2017
కాలనీలు మునిగిపోయాయి. రోడ్లు నదులను తలపించాయి. కార్లు, బైక్‌లు వరదనీటిలో కొట్టుకుపోయాయి. బెంగళూరులో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఆకాశానికి చిల్లు పడినట్టుగా.. కుంభవృష్టి కురిసింది. భారీ వర్షాలతో బెంగళూరు వణికిపోయింది. శుక్రవారం బీభత్సం సృష్టించిన వర్షం.. శనివారం కూడా కుంభవృష్టి కురిపించింది. ఇవాళ కూడా అదే పరిస్తితి కనిపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వర్షానికి తోడు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. 50 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు నేలమట్టం అవడంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రంతా విద్యుత్ లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఒకటే రోజు 23 సెంటీమీటర్ల వర్షం కురవడంతో నగరవాసులు భీతిల్లిపోయారు. మే నెలలో ఇంతటి వర్షం కువరడం 60 ఏళ్లలో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. అంతేకాదు, శనివారం ఒక్కరోజు కురిసిన వర్షం సాధారణ వర్షపాతంలో 90శాతం అని అంటున్నారు. బొమ్మనహళ్లి, కూడ్లు గేట్, ఎలక్ట్రానిక్ సిటీ, చందాపుర, పరప్పన అగ్రహార, అనేకల్ ప్రాంతాల్లో కుండపోత వర్షానికి రోడ్ల మీద మోకాళ్ల లోతు నీరు చేరింది. మరికొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మెజిస్టిక్, శివాజీ నగర, కేఆర్ మార్కెట్, హెబ్బాల, శివానంద సర్కిల్ దగ్గర అండర్‌పాస్‌లోకి భారీగా వరదనీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









