క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి ప్రాణం ఖరీదు 25 లక్షలు..
- May 28, 2017
యోగానంద్. వయసు నాలుగేళ్ళు. జీవితం గురించి తెలీదు. అమ్మ పెట్టే గోరు ముద్దలే అమృతం. అమ్మానాన్నే తన ప్రపంచం. బుడిబుడి అడుగులు... ముద్దు ముద్దు మాటలు. యోగానంద్ సందడితో ఆ ఇల్లు లోకమే మరచిపోయింది. ఆ సంతోషాన్ని చూసి కాలానికి కన్నుకుట్టిందేమో. విధి వక్రీకరించింది. ఏడాదిన్నర వయసులో ఆ పసిమనసు తట్టుకోలేని కష్టాన్నిచ్చింది. ఆ ఇంట సంతోషాల్ని ఆవిరిచేసింది. కారణం ప్యాంకోని ఎనీమియా. యోగానంద్ యేడాదిన్నర వయసున్నప్పుడు నీరసపడ్డాడు. దీంతో తల్లిదండ్రులు కలవర పడ్డారు. హైదరాబాద్ రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అప్పుడే తెలిసింది. భయంకరమైన క్యాన్సర్ కమ్మేసిందని. లక్షలు ఖర్చు చేస్తే తప్ప ఆ చిన్నారి బతకడని. బిడ్డ కోసం ప్రతీ రాయికీ మొక్కారు. ప్రతీ ఒక్కరినీ అర్ధించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఊపిరి నిలవాలంటే కావాల్సింది అక్షరాలా 25 లక్షలు. యోగానంద్ తండ్రి ఆంజనేయులు, తల్లి శోభ. వీరిది మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం చిమనగుంటపల్లి. ఆంజనేయులు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోసిస్తున్నాడు. బిడ్డుకు కష్టం రావడంతో చెన్నై అపోలోకు తీసుకెళ్ళాడు. ఉన్న పొలం, స్థలం, ఆటో అన్నీ అమ్మేశాడు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే జనార్ధన్‌రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 10 లక్షలు ఇప్పించారు. మొత్తం అంతా యోగానంద్ కోసం వెచ్చించారు. కానీ లాభం లేకపోయింది. బాబు పరిస్థితి మెరుగు పడాలంటే విడతలు విడతలుగా ఎముకలోకి గుజ్జు ఎక్కించాలి. తండ్రి నుంచి తీసి ఎక్కించారు. మూలకణాల డోసు తగ్గడంతో మళ్ళీ నీరసపడ్డాడు. అప్పటికే ఉన్నదంతా అయిపోయింది. మరోసారి చేయడానికి పాతిక లక్షలు కావాలి. ఇప్పుడు ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది. యోగానంద్‌కు పది రోజులకోసారి రక్తం ఎక్కించాలి. ఆ తర్వాత తొలి నాలుగు రోజులు బాగానే ఉంటాడు. ఆపై మళ్ళీ నీరసం. కదల్లేని పరిస్థితి. రోజురోజుకు పరిస్థితి దిగజారిపోతుంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆంజనేయులు, శోభ దంపతులు బిడ్డను చూసి కుమిలిపోతున్నారు. పుత్రభిక్ష పెట్టమని ప్రాధేయపడుతున్నారు. ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి... బిడ్డను కాపాడమని వేడుకుంటున్నారు. ఇది యోగానంద్ తల్లిదండ్రులకొచ్చిన కష్టం. ఆ చిన్నారి బోసినవ్వులు శాశ్వతం కావాలంటే... మనమూ అండగా నిలుద్దాం. మానవతా యజ్ఞంలో మనమూ పాలు పంచుకొందాం.ఆ తల్లి పుత్రశోకాన్ని తీరుద్దాం. ఫోన్ 99895 92101
తాజా వార్తలు
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్







