'కళానిలయం' మూడో వార్షికోత్సవం జూన్ 4న

- May 28, 2017 , by Maagulf

ముంబయి: ముంబయిలోని కళానిలయం  మూడో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 4న నవీ ముంబయి వాషిలోని సెక్టార్-16  లోని విష్ణుదాస్ భవే ఆడిటోరియం లో జరగనుంది. ఈ సంధర్బంగా ఈటీవీ జబర్దస్త్ బృందం చమ్మక్ చంద్ర,రచ్చ రవి, సాయి బృందం ప్రదర్శించనున్నారు.సినీ గీత విభావరి,నృత్య ప్రదర్శనలు ఉంటాయని కళానిలయం చైర్మన్ పి.సుజాత రావు తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్పెషల్ గెస్ట్ గా విచ్చేయనున్నారు.ఈ సంధర్బంగా మేరీ మాక్ మోహన్ పాల్(భారత నాట్యం)కు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేయనున్నారు.డాక్టర్ శైలజ దేశాయ్(కూచిపూడి),చలపతి రావు(యాంకర్),రామ్ భీమన(దర్శకుడు),సిరాశ్రీ(లిరిసిస్ట్),సుభాషిణి(కమెడియన్),మిస్ అంజనీ(యంగ్ లెంట్),రాజ్ మిసల్ (యంగ్ టాలెంట్)లకు కళానిలయం పురస్కారాలు అందజేయనున్నారు.ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగు వారు పాల్గొని విజయవంతం చేయలని పి.సుజాత రావు,పి.సుధాకర రావు ఒక ప్రకటనలో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com