జూన్ లోవిడుదలకు సిద్ధంగా ఉన్న "ఉంగరాల రాంబాబు"
- May 29, 2017
'జక్కన్న' తొ కమర్షియల్ సక్సెస్ ని తన సొంతం చేసుకొన్న సునీల్ హీరోగా.... ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలందుకొన్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఉంగరాల రాంబాబు. ప్రస్తుతం రీ రికార్డింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి.... యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్నారు. సునీల్ సరసన అందాల భామ మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. జిబ్రాన్ సంగీతమందించారు. జూన్ లో సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ '' మా దర్శకులు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం షూటింగ్ పూర్తయింది. సునీల్ నుంచి ఆశించే వంద శాతం కామెడీ ఇందులో చూస్తారు. ఎంజాయ్ చేస్తారు. దర్శకుడు క్రాంతి మాధవ్ హిలేరియస్ కామెడీ సన్నివేశాలతో కథను అద్భుతంగా చెప్పారు. నవ్వించమే ద్యేయంగా... అవుటాఫ్ కామెడి కాకుండా కథలోనే కామెడీని పొందు పరిచి నవ్విస్తాం. ప్రకాష్ రాజ్ గారి పాత్ర సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. హీరోయిన్ మియా జార్జ్ మరో ప్లస్ పాయింట్. పాటలు చాలా బాగా వచ్చాయి. ఆడియో సూపర్ హిట్ కావడం గ్యారంటీ. ప్రస్తుతం రీ రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రకాష్‌రాజ్, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రల్లో నటించారు. జిబ్రాన్ అందించిన ఆడియో చాలా బాగా వచ్చింది. జూన్ లో మా వినోదాల సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.'' అని అన్నారు.
నటీ నటులు - సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత







