బాలీవుడ్ నటుడు అక్షయ్,సైనాలకు మావోయిస్టుల హెచ్చరిక
- May 29, 2017
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు మావోయిస్టుల నుంచి హెచ్చరికలు వచ్చాయి. అక్షయ్ ఇటీవల జవాన్ల కోసం ‘భారత్ కా వీర్’ పేరిట వెబ్‌సైట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ వెబ్‌సైట్ ద్వారా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నారు.
సైనా నెహ్వాల్ కూడా మార్చిలో సుకుమా జిల్లాలో జరిగిన నక్సలైట్ల దాడుల్లో అమరవీరులైన 12 మంది జవాన్ల కుటుంబాలకు రూ.9లక్షలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గడ్‌లోని దక్షిణ బస్తర్ జిల్లాలో ఆదివారం పోలీసులకు కరపత్రాలు లభించాయి. దీనిలో అక్షయ్, సైనాలు జవాన్ల కుటుంబాలకు సాయం చేయకూడదని హిందీ, గోండి భాషల్లో రాసుంది. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం వెల్లడించారు. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు అక్షయ్ నుంచి కానీ సైనా నుంచి కానీ ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..







