హెచ్‌పీ మరియు కేపీఎంజీ నుంచి జీఎస్టీ సొల్యూషన్స్
- May 29, 2017
వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి రానుండటంతో హెచ్‌పీ సంస్థ దీనికి సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేపీఎంజీతో కలిసి కొత్త ల్యాప్‌ట్యాప్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. జీఎస్టీ సొల్యూషన్స్ పేరుతో జూన్ 5వ తేదీ నుంచి విక్రయించనున్న ఈ ల్యాప్‌టాప్‌ల ధర రూ.33,990గా నిర్ణయించారు. చిన్న మధ్యశ్రేణి వ్యాపార సంస్థల జీఎస్టీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీనిని తయారు చేసినట్లు హెచ్‌పీ చెబుతోంది. కొత్త పన్ను విధానాల ప్రకారం వ్యాపారుల లావాదేవీలను ఫైల్ చేయడానికి వీలుగా దీనిలో ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల కోసం హెచ్‌పీ ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను కూడా ఏర్పాటు చేసింది. మొబైల్ నంబర్లు, ఈ-మెయిల్ చిరునామాలు, చాట్‌ల ద్వారా పన్ను నిపుణులు అందుబాటులో ఉంటారు. ఈ బృందం 24నెలల పాటు వ్యాపారులకు సహాయ సహకారాలు అందిస్తుంది. దీని కొనుగోలుదారులకు హెచ్‌పీ శిక్షణ కూడా ఇవ్వనుంది. వీటిని హెచ్‌పీ స్టోర్లలో, హెచ్‌పీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
పన్నుల వ్యవస్థలో జీఎస్టీ వంటి భారీ మార్పు చోటు చేసుకుంటున్నప్పుడు దానికి అనుగుణంగా వినియోగదారుల వ్యవహారాలు సులభతరం అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని హెచ్‌పీ ఎండీ సుమీర్ చంద్ర తెలిపారు. జీఎస్టీ వల్ల 60లక్షల మంది చిన్న మధ్య శ్రేణి వ్యాపారులపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో అవసరమైన సాఫ్ట్‌వేర్ పరమైన ఇబ్బందులను ఎదుర్కొవడానికి హెచ్‌పీతో చేతులు కలిపి జీఎస్‌టీ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించినట్లు కేపీఎంజీ సీఈవో అంకుర్ కుమార్ తెలిపారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







