వచ్చేవారం లాంగ్ వీకెండ్
- October 08, 2015
యూఏఈ నివాసితులకు వచ్చేవారంలో లాంగ్ వీకెండ్ సంతోషాన్ని పంచనుంది. వారాంతంతో కలుపుకుని నాలుగు రోజులు పబ్లిక్ సెక్టార్లోనివారికి సెలవులు లభించనున్నాయి. ఈ ఏడాదిలో చాలా పర్వదినాలు వారాంతంతో కలుపుకుని రావడం జరిగింది. హిజ్రి క్యాలెండర్ ప్రకారం ఇస్లామిక్ సంవత్సరం వచ్చేవారం ప్రారంభమవుతుంది. ఆ మొదటి రోజును పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లకు సెలవు దినంగా ప్రకటించారు. క్యాలెండర్ ప్రకారం చూస్తే అక్టోబర్ 14, లేదా అక్టోబర్ 15న కొత్త ఇస్లామిక్ సంవత్సరం ప్రారంభమవుతుంది. అధికారికంగా సెలవు దినాన్ని (తేదీతో సహా) ఇంకా ప్రకటించవలసి ఉంది. వరుసగా సెలవులు వస్తుండడంతో పర్యాటక ప్రాంతాలు ప్రజలతో కళకళ్ళాడనున్నాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







