ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఉగ్రదాడి: ఎనిమిది మంది మృతి
- May 29, 2017
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో మరోమారు ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. కరాడా సెంట్రల్‌లో గల ఓ ఐస్‌క్రీం పార్లర్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. 22 మందికి పైగా గాయాలయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే పార్లర్‌లో ప్రజలే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాంబు దాడి అనంతరం ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. గాయాలపాలైన వారి ఆర్తనాదాలు, రోదనలతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







