విజయదశమికి మహేశ్ కథానాయకుడిగా 'స్పైడర్‌'

- May 29, 2017 , by Maagulf
విజయదశమికి మహేశ్ కథానాయకుడిగా 'స్పైడర్‌'

మహేశ్ కథానాయకుడిగా ఎ.ఆర్‌. మురుగదాస్‌ రూపొందిస్తోన్న 'స్పైడర్‌' సినిమా విజయదశమికి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా మహేశ వెల్లడించారు. ''ఈ దసరాకి మీ వద్దకు 'స్పైడర్‌' వస్తోంది. దీనికి సంబంధించి మే 31 (కృష్ణ పుట్టినరోజు) సాయంత్రం ఐదు గంటలకు వచ్చే ఫస్ట్‌ టీజర్‌తో పార్టీ మొదలవుతుంది'' అని ఆయన ట్వీట్‌ చేశారు. రకుల్‌ప్రీత్ సింగ్‌ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లియో ప్రొడక్షన్స్, ఎన్వీఆర్‌ సినిమా పతాకాలపై ఠాగూర్‌ మధు, ఎన్వీ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళ దర్శకుడు ఎస్‌.జె. సూర్య ప్రతినాయక పాత్రను పోషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తయారవుతున్న ఈ చిత్రంలో మహేశ్ ఇంటలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. మురుగదాస్‌ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్‌లు ఒక కాన్సెప్ట్ తో కనిపిస్తాయి. అదే తరహాలో ఈ సినిమాలోనూ యాక్షన్ పార్టులను చాలా శ్రద్ధతో తీర్చిదిద్దుతున్నారు మురుగదాస్‌. ఈ చిత్రానికి పీటర్‌ హెయిన్స్, కణల్‌ కణ్ణన్, అన్బరివ్‌ ('కబాలి' ఫేమ్‌) యాక్షన్ డైరెక్టర్‌లుగా పనిచేస్తున్నారు. హారిస్‌ జయరాజ్‌ స్వరాలు కూరుస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com