అమెరికాలో నితిన్ 'లై' యాక్షన్

- May 29, 2017 , by Maagulf
అమెరికాలో నితిన్ 'లై' యాక్షన్

''నితిన్ కెరీర్‌లోనే 'లై'ని భారీగా తెరకెక్కిస్తున్నాం. ఇటీవల అమెరికాలో తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్, పాటలు సినిమాకు హైలైట్‌ అవుతాయి'' అని 'లై' చిత్ర నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర అన్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్ మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రూపొందుతోంది. వెంకట్‌ బోయనపల్లి సమర్పిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ''నితిన్ కెరీర్‌లో డిఫరెంట్‌ చిత్రంగా రూపొందుతోంది. అమెరికాలోని ఎలినెవేడా, లాస్‌ వెగా్‌సలో యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించాం. కాలిఫోర్నియాలోని మొజావేలోని మిడెస్ట్ లో ఫైట్‌ మాస్టర్‌ కెచ్చా నేతృత్వంలో వెయ్యిమంది ఫైటర్ల మధ్య క్లైమాక్స్‌ను భారీగా తెరకెక్కించాం. హాలీవుడ్‌ ఫైట్‌ మాస్టర్‌ జెఫ్రీ ట్రాయ్‌ జెయ్‌ ఓ ఛేజ్‌ను, స్టన్ శివ మరో ఛేజ్‌ను కంపోజ్‌ చేశారు. మరో యాక్షన్ సీక్వెన్స్ ను 'ట్రాన్స్ ఫార్మర్స్‌'ని షూట్‌ చేసిన డోనాల్ట్‌ ట్రంప్‌కి చెందిన ట్రం ప్‌ టవర్స్‌లో తెరకెక్కించాం. వీటితో పాటు మూడు పాటలను కూడా పూర్తి చేశాం. జూన్ 7 నుంచి 11 వరకు చికాగోలోని డౌన్ టౌన్ లో ఒక పాటను చిత్రీకరిస్తాం.
జూన్ 14తో అమెరికా షెడ్యూల్‌ పూర్తవుతుంది. ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com