మాస్కోలో గత వందేళ్లలో ఎప్పుడూ లేనంత ప్రమాద కరమైన వడగళ్ల తుఫాన్
- May 29, 2017
మాస్కోలో వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షంతో జనజీవనం స్తంభించింది. ఉరుములు, మెరుపుల వర్షానికి మొత్తం 11 మంది మరణించారు. మరో వంద మంది వరకు గాయపడ్డారు. బలమైన గాలివాన ధాటికి చాలా చోట్ల చెట్లు నేలకూలగా.. రవాణా వ్యవస్థ స్తంభించింది. భారీ వర్షాల ధాటికి మాస్కో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 60 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రష్యా రాజధాని మాస్కోను ఉరుముల తుఫాను గాలులు కుదిపేశాయి. ప్రాణనష్టానికి కారణమైంది. బలంగా వీచిన గాలులకు రోడ్లపై చెట్లు కూలిపోయాయి, హోర్డింగులు, ట్రాఫిక్ లైట్లు నేలకూలాయి.. రహదారులన్నీ విలయంలో చిక్కుకుపోవడంతో వాటిపై ప్రయాణిస్తున్న వారు వాహనాల్లో భారీగా చిక్కుకుపోయారు. ఈ విలయంలో పదకొండు మంది మృతి చెందగా.. దాదాపు 50 మందిని ఆస్పత్రులకు తరలించారు. మాస్కోలో ఎలక్ట్రికల్ కేబుల్స్ డామేజ్ కావడంతో సిటీ అంతా పవర్ సప్లైకు అంతరాయం ఏర్పడింది. బలమైన గాలులతోపాటూ వడగళ్ల వర్షం, ఉరుములు పిడుగులు నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. ఎప్పుడూ లేనివిధంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో జనం చాలావరకూ ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోయారు. గత వందేళ్లలో ఎప్పుడూ లేనంత ప్రమాదకరమైన తుఫానుగా భావిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో చెట్లు కూలడం వల్ల వాటి కింద పడి ఐదుగురు వరకూ చనిపోయారు. వర్షాలు, గాలుల వల్ల మెట్రో రైళ్లు ఆలస్యమయ్యాయి. మాస్కోలో తుపాను విధ్వంసం, టెన్నిస్ కోర్ట్ రూఫ్ ఎగిరిపోవడం లాంటి వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విలయం గురించి వేగంగా ప్రపంచమంతా వ్యాపించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడితో చర్చల కోసం పారిస్ వెళ్లిన పుతిన్ అక్కడి నుంచే మాస్కోలో పరిస్థితిని సమీక్షించారు.
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









