రెండు తెలుగు రాష్ర్టాల్లో హోటళ్లు బంద్
- May 29, 2017
జులై ఒకటి నుంచి అమలుకానున్న కొత్త వస్తుసేవల పన్ను-జీఎస్టీలో హోటళ్లపై విధించిన 18శాతం పన్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ మంగళవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు బంద్
పాటించాలని ఆ సంఘం నిర్ణయించింది. దీనికి దక్షిణాది రాష్ట్రాల హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం కూడా మద్దతు తెలిపింది.
కొత్త పన్నుతో వినియోగదారులపై మరింత భారంపడే ప్రమాదముందని, దీనికారణంగా ఈ సెక్టార్ దివాలా తీయడం ఖాయమని అంటున్నారు సంఘం నేతలు.
ఇప్పటివరకు కేరళ, కర్ణాటకల్లో హోటళ్లు, రెస్టారెంట్లపై ఎలాంటి పన్నులేదని, తమిళనాడులో కేవలం 2శాతం పన్ను మాత్రమే విధించేవారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు 18 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్ల ఇండస్ర్టీ వల్ల సుమారు 40 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. వందల కోట్ల రూపాయలు పన్ను చెల్లిస్తున్నారు. జీఎస్టీ అమల్లోకి వస్తే అదనంగా రూ.1500 కోట్లు కట్టాల్సి వస్తుందని వాపోయారు సంఘం నేతలు. ఇదే సమయంలో వివిధ దేశాల్లో హోటళ్లపై పన్ను చాలా తక్కువగా వుందని నేతలు గుర్తు చేశారు.
థాయ్‌లాండ్-5 శాతం, యూఏఈ-5, అమెరికా-7.5, సింగపూర్-7, జపాన్- 8 శాతం వుందంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







