జర్మన్‌ఛాన్సలర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ
- May 29, 2017
నాలుగు దేశాల పర్యటనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జర్మనీతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ దేశ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్‌తో మంగళవారం భేటీ అయ్యారు. మెర్కెల్ తన అధికారిక నివాసం స్కాలస్ మెసెబర్గ్‌లో ఈ ఉదయం ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మెసెబర్గ్ లాన్‌లో నడుస్తూ కాసేపు ముచ్చటించారు.
అనంతరం మెర్కెల్, మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. పెట్టుబడులు, సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు తదిరత అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదంపై పోరు, దేశ భద్రత గురించి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మెర్కెల్‌తో భేటీపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘గుడ్ ఇంటారక్షన్’గా పేర్కొన్నారు. మెసెబర్గ్ లాన్‌లో మెర్కెల్ మాట్లాడుతున్న ఉన్న ఫొటోలను ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
భేటీ అనంతరం ఏంజెలా ఏర్పాటుచేసిన అధికారిక విందులో మోదీ పాల్గొననున్నారు. ఆ తర్వాత జర్మనీలోని ప్రముఖ వాణిజ్యవేత్తలతో సమావేశమవుతారు. ప్రధాని రెండు రోజుల పాటు జర్మనీలో పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు







