పుణుకుల పులుసు
- May 29, 2017
కావలసిన పదార్థాలు: పెరుగు - 2 కప్పులు, పసుపు - పావు టీ స్పూను, శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 2, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర - 1 కట్ట, ధనియాలపొడి - 1 టీ స్పూను, నెయ్యి - అర టేబుల్ స్పూను, ఎండుమిర్చి - 4, ఆవాలు, జీలకర్ర, మినపప్పు - (అన్నీ కలిపి) 1 టీ స్పూను, ఇంగువ - చిటికెడు.
పుణుకుల తయారీకి: శనగపిండి - 2 కప్పులు, వంటసోడ - చిటికెడు, ఉప్పు - తగినంత, మసాలపొడి, ధనియాలపొడి - 1 టీ స్పూను చొప్పున., నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో శనగపిండి, కారం, ధనియాలపొడి, మసాలపొడి, ఉప్పు, చిటికెడు వంటసోడా వేసి తగినంత నీరు జతచేస్తూ జారుగా (పుణుకుల కోసం) కలిపి పక్కనుంచుకోవాలి. మరోపాత్రలో పెరుగు, రెండుకప్పుల నీరు, పసుపు, తరిగిన మిర్చి, ఉల్లి, శనగపిండి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు చేర్చి కవ్వంతో అన్నీ కలిసేలా (పెరుగు ముక్కలు కన్పించకుండా) చిలకాలి.
కడాయిలో నెయ్యి వేసి ముందుగా ఇంగువ వేసి తర్వాత ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి, తాలింపు వేగాక మజ్జిగ మిశ్రమాన్ని కలిపి 5 నిమిషాలపాటు సన్నని సెగమీద మరనివ్వాలి. ఇప్పుడు మరో కడాయిలో నూనెవేసి పుణుకులు తయారుచుసుకుని తినడానికి 5 నిమిషాల ముందు మజ్జిగ పులుసులో వేసి నానబెట్టాలి. పుణుకుల పులుసు అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









