చైనా కలెక్షన్లతో బాహుబలి కలెక్షన్ల రికార్డ్ ను బీట్ చేసిన హిందీ మూవీ దంగల్

- May 30, 2017 , by Maagulf
చైనా కలెక్షన్లతో బాహుబలి కలెక్షన్ల రికార్డ్ ను బీట్ చేసిన హిందీ మూవీ  దంగల్

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి ది.. కంక్లూజన్ తో ఎన్నో రికార్డ్స్ ను క్రియేట్ చేసిన సంగతి విధితమే.. దేశంలోనే తొలిసారిగా వెయ్యి కోట్లను దాటిన మొదటి సినిమాగా రికార్డ్ సృష్టించింది.. కాగా ఈ విజువల్ వండర్ సృష్టించిన వసూళ్ల సునామిని వెనక్కునెట్టి, చరిత్ర సృష్టించే సినిమా వస్తుందా? ఇప్పుడప్పుడే సాధ్యం కాదులే అనుకున్న వాళ్లందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆమిర్ ఖాన్ దంగల్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. చైనీస్ వసూళ్లతో బాహుబలి ది కన్ క్లూజన్ ను దాటిపోయింది దంగల్. వివరాల్లోకి వెళ్తే...
బాహుబలి-2 కలెక్షన్ల సునామీని దంగల్ బీట్ చేసింది. రాజమౌళి మేకింగ్ తో వెయ్యి కోట్లు దాటిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డులు క్రియేట్ చేసి, ఇండియన్ సినీహిస్టరీలో చెరగని ముద్రవేసిన బాహుబలి ది కనుక్లూజన్ ఇప్పటివరకు 1633కోట్లు కలెక్ట్ చేసింది. ఇదే ఇప్పటివరకు ఇండియన్ సినీ హిస్టరీలో హయ్యెస్ట్ గ్రాసర్ మూవీ. కానీ ఇప్పుడీ రికార్డ్ ను చెరిపేస్తూ దంగల్ సినిమా మరో కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది.
బాహుబలి-2 వెయ్యి కోట్లు కొట్టాక, దంగల్ సినిమా ఛైనాలో రిలీజ్ అయ్యింది. అక్కడ విడుదలైన ఫస్ట్ డే నుంచే భారీ వసూళ్లు వచ్చాయి. ఫస్ట్ వీక్ కే అక్కడ 600లకోట్లకు పైగా వసూళ్లు సాధించింది దంగల్. దీంతో ఆమిర్ ఖాన్ కూడా వెయ్యికోట్ల హీరోగా మారిపోయాడు. బాహుబలి-2 కలెక్షన్ల వైపు పరుగులు పెట్టాడు. అయితే చైనాలో పీకె 122కోట్ల వరకు కలెక్ట్ చెయ్యడంతో దంగల్ కూడా తర్వాత స్లో అవుతుంది అనుకున్నారు. కానీ స్పోర్ట్స్ ను డే లైఫ్ లో ఓ భాగంగా చేసుకున్న చైనీస్ .. దంగల్ కు ఫుల్లుగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈసినిమా ఇప్పటివరకు 1665కోట్లు కలెక్ట్ చేసింది. బాహుబలి-2 ఇప్పటివరకు చైనాలో రిలీజ్ కాలేదు. ఒకవేళ అక్కడ రిలీజ్ అయితే ఈ కన్ క్లూజన్ కు ఎన్ని కోట్లు వస్తాయి అనే దాన్ని బట్టి, దంగల్ మార్క్ ను బాహుబలి-2 క్రాస్ చేస్తుందా? లేదా అనేది తేలిపోనుంది. కానీ బాహుబలి ది బిగినింగ్ చైనాలో పెద్దగా వసూళ్లు సాధించలేదు. అలాంటిది ఇప్పుడు బాహుబలి-2 వందలకోట్లు సాధిస్తుందా? అనేది ట్రేడ్ మార్కెట్ కు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఇప్పటివరకు మాత్రం బాహుబలి-2పై దంగల్ దే పైచేయి అని కొందరంటే, గ్యాప్ లేకుండా సింగిల్ రిలీజ్లోనే ఇన్ని కోట్లు కొట్టిన బాహుబలే గొప్ప అని మరికొందరంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com