ఇళ్ళకు కన్నాలు వేస్తున్న ఐదుగురు నిర్వాసితులు
- May 30, 2017
బతుకుతెరువు కోసం పరాయి దేశం వెళ్ళి ఉద్యోగమో ..సద్యోగమో చూసుకోక ...ఓ అయిదుగురు ప్రవాసీయులు తమ చోరకళను ప్రదర్శించారు..అందుకు తగిన ప్రతిఫలాన్ని పొందారు. దోహా నేర న్యాయస్థానం ఒకొక్కరికి మూడు సంవత్సరాల జైలుశిక్ష అనంతరం దేశ బహిష్కరణ శిక్ష విధించింది. ఈ నిందితులు అనేక గృహాలను విచ్ఛిన్నం చేసి తరువాతి ఆ ఇళ్ళల్లో డబ్బు మరియు ఆభరణాలు దొంగిలించేవారని పోలీసులు నివేదించారు. ఓ బాధితుడు విదేశాల్లో పర్యటన ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చిన ఆయన తన వంటగది తలుపు విరిగి ఉండటం బంగారు ఆభరణాలతో పాటు 6,000 కతర్ రియాళ్ళు అపహరణకు గురైనట్లు గుర్తించి లబోదిబోమని స్థానిక పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ కేసు పై దర్యాప్తు ప్రారంభమైంది. పోలీసుల పరిశోధనలలో ఓ ఐదుగురు ముద్దాయిల బృందం ఈ దొంగతనాలకు సూత్రకర్తలుగా నిర్ధారించారు. వీరు పలు వీధులలో తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లను ఎంతో శ్రద్ధగా పరిశీలించేవారు ..ఆయా ఇంటి యజమానులు బైటకు వెళ్లినప్పుడో..లేక వారు దేశం వెలుపల పర్యటనల కోసం వెళ్లిన తర్వాత ఆ ఇళ్లను చూడటం...ఆ తర్వాత ఎవరూ గమనించని సమయంలో ఆ ఇంటి లోనికి చొరబడి ఎంచక్కా దోచుకొనేవారు. పోలీసుల పరిశోధనలలో ఈ అయిదుగురు ప్రవాసీయులు ఇదే తరహాలో పలు దొంగతనాలు చేసినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







