కన్నడ సినీ పరిశ్రమలో విషాదం
- May 30, 2017
లెజండరీ నటుడు రాజ్‌కుమార్ సతీమణి కన్నుమూత
ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు కన్నుమూయడంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకొనగా.. అటు కన్నడ చిత్ర పరిశ్రమలోనూ విషాదం నెలకొంది. లెజండరీ నటుడు, కన్నడ కంఠీరవం రాజ్‌కుమార్ సతీమణి పార్వతమ్మ రాజ్‌కుమార్ బుధవారం తుదిశ్వాస విడిచారు. కిడ్నీ, శ్వాసకోశ సమస్యలతో ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం తెల్లవారుజామున 4.40 గంటలకు కన్నుమూశారు.
78 ఏళ్ల పార్వతమ్మ ఆరోగ్యం విషమించడంతో ఈ నెల 14న ఆస్పత్రిలో చేరింది. అప్పటినుంచి వెంటిలేటర్ మీద ఉన్న ఆమెకు వైద్యులు ప్రత్యేక శస్త్రచికిత్సలు నిర్వహించినా లాభం లేకపోయింది. పూర్ణ ప్రంగ వాటికలో ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భర్త రాజ్‌కుమార్ తరహాలోనే పార్వతమ్మ కూడా తన రెండు కళ్లను దానం చేశారు.
రాజ్‌కుమార్-పార్వతమ్మ దంపతులకు మొత్తం ఐదుగురు సంతానం. వీరి తనయులైన పునీత్ రాజకుమార్, శివరాజ్‌కుమార్ ప్రస్తుతం కన్నడ అగ్ర హీరోలుగా ఉన్నారు. నిర్మాతగా కూడా పార్వతమ్మ తనదైన ముద్ర వేశారు. ఆమె అప్పు, అరసు, వంశీ, హుడుగారు, అభి వంటి సినిమాలను తెరకెక్కించారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసుకున్నారు. ఆమె కుటుంబానికి పలువురు కన్నడ సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







