భారత్‌లోకి ప్రవేశించిన ప్రమాదకర వైరస్ జికా
- May 31, 2017
ఆఫ్రికా దేశాలను భయభ్రాంతులకు గురిచేసిన ప్రాణాంతక జికా వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. గుజరాత్‌లోని అహ్మదా బాద్ సిటీలోని బాపూనగర్ ప్రాంతంలో ముగ్గురికి జికా వైరస్ సోకిన విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) శనివారం నిర్ధారించింది. వైరస్ బారినపడిన వారిలో గర్భిణి, 64 ఏళ్ల వృద్ధుడు, బాలింత ఉన్నారు. వీరంతా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం.
సాధారణ నిర్ధారణ పరీక్షలో భాగంగా అహ్మదాబాద్‌లోని బీజే వైద్యకళాశాల ఆధ్వర్యంలో 93 రక్తనమూనాలపై ఆర్‌టీ–పీసీఆర్ టెస్ట్ జరపగా వైరస్ ఉన్న సంగతి వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన శాంపిళ్లపై మళ్లీ నిర్ధారణ కోసం పుణెలోని ల్యాబ్‌లో టెస్టులు చేశారు.
నిర్ధారణ పరీక్షల వివరాలను డబ్ల్యూహెచ్‌వోకు పంపించామని, వైరస్ జాడను నిర్ధా రిస్తూ అక్కడి నుంచి సమాచారం వచ్చిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో భారత్‌లోకి జికా వైరస్ ప్రవేశించినట్టు వైద్యులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







