650 మంది ప్రభుత్వ పాఠశాల సిబ్బంది తొలగింపు
- May 31, 2017
దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి 650 మంది ఉద్యోగులను వారి వారి విధుల నుండి తొలగిస్తున్నట్లు ఉన్నత విద్యా మంత్రిత్వశాఖకు చెందిన ఒక అధికారిక సమాచారం ద్వారా వెల్లడైంది. స్థానిక అరబిక్ రోజువారీ అర్రేయా అధికారికంగా, కార్య నిర్వహణాభివృద్ధి , కార్మిక మరియు సాంఘిక వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని పరిపాలనా ఉద్యోగాలను నియామకం జరపడానికి ఇంటర్వ్యూ నిర్వహించింది. అందులో ఎంపికైన ఖతరీ అభ్యర్థుల జాబితాలను విద్య మంత్రిత్వశాఖ అందించిందని పేర్కొంది. తొలగించబడిన ఉద్యోగాలలో అధికభాగం ఉద్యోగాలు పరిపాలనా స్వభావం కలిగినవేనని ఓ సమాచారం. అయితే అకడమిక్ ఉద్యోగాలు ఉద్యోగుల సంఖ్యలో సరి పోల్చితే కేవలం 15 శాతం మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా, తొలగించబడిన 100 మంది ప్రవాసీయులైన ఉద్యోగులు తమ పదవీకాలం ముగిసి పదవీ విరమణ వయస్సుకు చేరారు. అలాగే, మిగిలిన రద్దు చేయబడిన కొంతమంది ఉద్యోగులలో వారు తాత్కాలికంగా మాత్రమే నియమించబడ్డారు. ఖతార్ వాసులు ద్వారా భర్తీ కాబడిన పలు ఉద్యోగాల ప్రధానంగా ఏవంటే సామాజిక కార్యకర్తలు, బాలికల పాఠశాల బస్సు పర్యవేక్షణ , స్టోర్ హౌస్ కీపర్, మరియు పరిపాలనా పర్యవేక్షకుడు వంటివి. కొత్త ఉద్యోగాల కోసం ఉపాధిని భర్తీ చేయడమే కాక, నూతన విద్యా సంవత్సరం ఇతర ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి అవకాశాన్ని కల్పించడం కోసం ఇప్పుడు చేస్తున్న వారి ఉద్యోగాలను రద్దు చేస్తున్నట్లు ఆ అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!







