హౌసింగ్‌ మినిస్ట్రీతో మిడిల్‌ ఈస్ట్‌ హాస్పిటల్‌ ఎంఓయూ

- May 31, 2017 , by Maagulf
హౌసింగ్‌ మినిస్ట్రీతో మిడిల్‌ ఈస్ట్‌ హాస్పిటల్‌ ఎంఓయూ

మిడిల్‌ ఈస్ట్‌ హాస్పిటల్‌ని హౌసింగ్‌ మినిస్ట్రీ అండర్‌ సెక్రెటరీ షేక్‌ అబ్దుల్లా బిన్‌ అహ్మద్‌ అల్‌ ఖలీఫా సందర్శించారు. మిడిల్‌ ఈస్ట్‌ హాస్పిటల్‌ మరియు మెడికల్‌ సెంటర్‌ - హౌసింగ్‌ మినిస్ట్రీ మధ్య ఎంఓయూలో బాగంగా ఈ పర్యటన సాగింది. మినిస్ట్రీకి చెందిన ఉద్యోగులు, వారి కుటుంబాలకు వైద్య చికిత్సల్లో ప్రత్యేక డిస్కౌంట్‌కి సంబంధించిన ఎంఓయూ ఇరు వర్గాల మధ్యా కుదిరింది. అండర్‌ సెక్రెటరీతోపాటుగా హౌసింగ్‌ మినిస్ట్రీ డైరెక్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ మరియు ఫైనాన్షియల్‌ డైరెక్టరేట్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ ఇబ్రహీమ్‌ అల్‌ ఖలీఫా మరియు హౌసింగ్‌ మినిస్ట్రీ చీఫ్‌ ఆఫ్‌ పిఆర్‌ అండ్‌ మీడియా హైతమ్‌ కమాల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసుపత్రి అంతటా వీరు సందర్శించి, ఆసుపత్రిలోని సౌకర్యాల గురించి వాకబు చేశారు. బహ్రెయిన్‌లో ఓపెన్‌ ఎంఆర్‌ఐ మెషీన్‌ని కలిగి ఉన్న అతి కొద్ది హాస్పిటల్‌లో మిడిల్‌ ఈస్ట్‌ హాస్పిటల్‌ ఒకటి. భవిష్యత్తులో బహ్రెయిన్‌ వైద్య రంగంలో మిడిల్‌ ఈస్ట్‌ హాస్పిటల్‌ మరిన్ని అద్భుతాలు సాధిస్తుందని అండర్‌ సెక్రెటరీ ఆశాభావం వ్యక్తం చేశారు. మిడిల్‌ ఈస్ట్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ వర్గీస్‌ కురియన్‌ మాట్లాడుతూ, అందుబాటులోకి వస్తున్న సరికొత్త వైద్య విధానాల్ని అందిపుచ్చుకుని, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com