సౌదీ అరేబియాలో ఓ బంపర్ ఆఫర్..
- June 01, 2017
పండుగల సీజన్లో షాపింగ్ మాల్స్ ఆఫర్స్ ప్రకటించడం మామూలే. డిస్కౌంట్లు, ఆఫర్లు, లక్కీడ్రాలు అంటూ ఊదరగొట్టేస్తారు. అలాగే సౌదీ అరేబియాలోని లూలు సూపర్ మార్కెట్ కూడా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే రొటీన్‌కు కాస్త భిన్నంగా ఉండడంతో... జనం ఎగబడ్డారు. ఆఫర్‌ను అందుకునేందుకు... ఒకరితో ఒకరు పోటీపడ్డారు..
జనాన్ని అంతలా అట్రాక్ట్ చేసిన ఆఫర్ ఏంటో తెలుసా... అరగంటలో ఏం కొన్నా ఉచితమే. 30 నిముషాల పాటు మాల్లోని ఏ వస్తువు తీసుకున్నా బిల్ చెల్లించాల్సిన అవసరం లేదని... మాల్ యాజమాన్యం ప్రకటించడమే ఆలస్యం జనం చీమల పుట్ట పగిలినట్లు తరలివచ్చారు. పరుగుపరుగున వెళ్లి చేతికి అందిన వస్తువు సొంతం చేసుకున్నారు. ఈ వీడియోలు నెట్లో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఉచితం అనే సరికి కొందరు తాము మోయలేని వస్తువులు సైతం ఎత్తేందుకు ప్రయత్నించడం నవ్వు తెప్పిస్తోంది
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







