మెగా ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్
- October 09, 2015
మెగా ఫ్యామిలీ నుండి సినిమా రంగంలోకి వస్తున్న తొలి హీరోయిన్ నిహారిక. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురైన ఈ ముద్దుగుమ్మ త్వరలో 'ఒక మనసు' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో. ఇప్పటి వరకు స్టార్ హీరోల వారసులు హీరోగా పరిచయం అవుతున్నారంటే... వారిని పరిచయం చేయడానికి భారీ ఈవెంట్స్ నిర్వహించడం ఆనవాయితీ. మెగా ఫ్యామిలీ హీరోల లాంచింగ్ సమయంలో కూడా ఇలాంటి ఈవెంట్స్ జరిగాయి. తాజాగా నిహారిక ను అందరికీ పరిచయం చేయడానికి మెగా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవితో పాటు ఇతర స్టార్స్ అంతా హాజరవుతారని సమాచారం. నిహారిక తొలి సినిమాకు.....మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి నిహారిక రూ. 40 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. సాధారణంగా కొత్త హీరోయిన్లకు రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు మించి ఇవ్వరు. కానీ నిహారిక తొలి సినిమాకే రూ. 40 లక్షలు తీసుకుంటుండటం గమనార్హం. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న అమ్మాయి కావడం సినిమాకు ఓపెనింగ్స్ బావుంటాయి. అందు వల్లనే ఆమెకు ఇంత ఎక్కువ మొత్తం రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. మెగా స్టార్ వారసత్వంతో మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు దాదాపు అరడజను మంది హీరోలు పరిచయం అయ్యారు. అయితే ఆ ఫ్యామిలీ నుండి హీరోయిన్ మాత్రం ఇప్పటి వరకు సినిమా రంగంలోకి రాలేదు. నాగబాబు కూతురు నిహారిక మెగా ఫ్యామిలీలో కొత్త శకానికి నాంది పలికింది. ఈ సినిమా ఇంకా ప్రారంభం కాక ముందే ఆమెకు హీరోయిన్ గా మరో ఆఫర్ కూడా వచ్చినట్లు సమాచారం. అవార్డు సినిమా దర్శకుడు అయోధ్య కుమార్ దర్శకత్వంలో ఆమె సినిమా అంగీకరించినట్లు సమాచారం.అయోధ్య కుమార్ మిణుగురులు చిత్రంతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. మంచి కాన్సెప్టుతో కూడిన కథ చెప్పడంతో నాగబాబు ఓకే చేసినట్లు సమాచారం. మరో విశేషం ఏమిటంటే....ఈ చిత్రం తెలుగు-తమిళంలో తెరకెక్కబోతోందట
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్‌లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







