తెలంగాణా రాష్ట్రబంద్ కు విపక్షాలు పిలుపు
- October 09, 2015
రాష్ట్రబంద్ కు విపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో డిపోల ఎదుట బైఠాయించిన నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఎంజీబీఎస్ వద్ద బస్సుల రాకపోకలను అడ్డుకునేందుకు అక్కడ బైఠాయించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానం నాగేందర్ లను అదుపులోకి తీసుకుని బలవంతంగా అక్కడినుంచి తరలిస్తున్నారు. రైతు రుణాలను ఒకే దఫాలో మాఫీ చేసేంత వరకు పోరాడుతామని ఉత్తమ్ పేర్కొన్నారు. మెహిదిపట్నంలో షబ్బీర్ అలీని అరెస్ట్ చేసి బస్సులకు దారిచ్చేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీ బస్టాండ్ వద్ద బైఠాయించిన టీటీడీపీ, బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, ఎల్ రమణ, చింతల రాంచంద్రారెడ్డి, లక్ష్మణ్, తదితరులను అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్ కు తరలించారు. దిల్ సుఖ్ నగర్ ఆర్టీసీ డిపో ముందు బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి అంబర్ పేట పీఎస్ కు తరలించారు. కూకట్ పల్లి డిపో వద్ద విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి పీఎస్ కు తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







