డ్రైవర్ లేకుండా చక్కర్లు కొడుతున్న బస్సులు
- October 10, 2015
గ్రీసు బస్సుల్లో డ్రైవర్ ఉండడు. అయినా చక్కగా రోడ్లపై తిరుగుతుంటాయి. బస్టాప్‌ల వద్ద ప్రయాణికులనూ ఎక్కించుకుంటాయి. డ్రైవర్ లేకుండా చక్కర్లు కొడుతున్న బస్సులను చూడాలంటే గ్రీస్ వెళ్లాల్సిందే. గ్రీస్‌లో ప్రయోగాత్మకంగా డ్రైవర్‌లెస్ బస్సులు గ్రీస్‌లోని త్రికల నగరంలో డ్రైవర్‌లెస్ బస్సులను ప్రయోగాత్మకంగా నడిపిస్తున్నారు. జీపీఎస్ ఆధారంగా నడిచే ఈ బస్సుల్లో ఆటోమేటిక్ కెమెరాలు ఉంటాయి. కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది. ఈ సమాచారం ఆధారంగా బస్సు ఎప్పటికప్పుడు నియంత్రించుకుని నడుస్తుంది. రోడ్డుపైన ఎవరైన అడ్డు వస్తే తనంతట తానుగా ఆగిపోతుంది. రోడ్ క్లియర్‌గా ఉంటేనే ముందుకు కదులుతుంది. ఇదంతా జీపీఎస్ ఆధారంగానే పని చేస్తుంది. పది మంది ప్రయాణికుల సామర్థ్యం పది మంది ప్రయాణికుల సామర్థ్యం ఉన్న ఈ డ్రైవర్‌లెస్ బస్సులను ప్రస్తుతానికి ట్రయల్‌రన్ నిర్వహిస్తున్నారు. ఈ నెల చివరి వరకు వీటిని ఇలా పరీక్షించి వచ్చే నెల ప్రారంభానికి పూర్తి స్థాయిలో నడపనున్నారు. ట్రయల్ రన్ డ్రైవర్‌లెస్ బస్సులను చైనా సైతం ప్రయోగాత్మకంగా చేపట్టింది. వీటినీ ట్రయల్ రన్నిర్వహిస్తున్నారు. అనుకున్నట్లుగా జరిగితే.. త్వరలోనే పలు దేశాల్లో డ్రైవర్‌లెస్ బస్సులు దర్శనమివ్వనున్నాయి
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









