తెలంగాణలో మరో రాజకీయ పార్టీ రాబోతుంది
- June 02, 2017
బడుగుల సంక్షేమమే ఎజెండాగా తెలంగాణలో మరో పార్టీ పురుడుపోసుకుంది. ఉద్యమకారుడు చెరుకు సుదాకర్ ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త పార్టీ..ప్రజల కోసమే పనిచేస్తామని ప్రకటించింది. కేసీఆర్ మూడేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు తెలంగాణ ఇంటి పార్టీ నేతలు.
తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ఉద్యమకారుడు చెరుకు సుదాకర్, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఇంటి పార్టీ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ రోజున నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన పార్టీ తొలి సభకు పలు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు.
తెలంగాణలో 80శాతం ఉన్న బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తామని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. మూడేళ్లు పూర్తయినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించటం లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని నాయకులు విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన ఉద్యమకారులకు కనీస గౌరవం దక్కలేదన్నారు. ప్రజల కోసమే తెలంగాణ ఇంటిపార్టీ ఏర్పడిందని చెప్పిన నాయకులు..తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







