అమెరికాలో హెచ్-1బీ వీసాలపై కొత్త నిబంధనలు

- June 02, 2017 , by Maagulf
అమెరికాలో హెచ్-1బీ వీసాలపై కొత్త నిబంధనలు

అమెరికాలో మాస్టర్‌ డిగ్రీ, ఇతర ఉన్నత విద్యల్ని అభ్యసించిన విదేశీ విద్యార్థులకు జారీ చేసే H1-b వీసాలపై.. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. విద్యార్థులు డిగ్రీ తీసుకునే సమయానికి ఆ విద్యాసంస్థకు.. యునైటెడ్‌ స్టేట్స్‌ ఇన్‌స్టిట్యుషన్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ గుర్తింపు ఉంటేనే ‘స్టూడెంట్‌ హెచ్‌–1బీ’ వీసా ఇస్తారు. ఈ మేరకు అమెరికా ఇమ్మిగ్రేషన్‌ విభాగం USCIS స్పష్టం చేసింది. ప్రతీ ఏడాది 65వేల H1-b వీసాలు ఇస్తుండగా.. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించినవారికి అదనంగా 20వేల H1-b వీసాలు మంజూరు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com