మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

- June 03, 2017 , by Maagulf
మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

తెలంగాణ భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పుట్టిరోజును పురస్కరించుకుని టీఆర్‌ఎస్‌ నాయకులు శనివారం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హరీశ్‌రావుకు కేటీఆర్‌ ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. హరీశ్‌రావు సమర్థవంతుడైన నాయకుడని కొనియాడారు.

‘స్పష్టమైన భావప్రకటన, కష్టపడేతత్వం, సమర్థత కలిగిన కొంతమంది నాయకుల్లో ఒకరైన హారీశ్‌రావు గారికి జన్మదిన శుభాకాంక్షల’ని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ట్విటర్ ద్వారా హరీశ్‌రావుకు శుభాకాంక్షలు తెలిపింది.

మరోవైపు హరీశ్‌రావు తన నియోజకవర్గం సిద్ధిపేటలో కలియ తిరిగారు. ఇంటింటికీ వెళ్లి అభిమానులను అప్యాయంగా పలకరించారు. బాలింతలకు కేటీఆర్‌ కిట్లు పంపిణీ చేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులు పోటీ పడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com