మరుగుజ్జుగా మన బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్

- June 03, 2017 , by Maagulf
మరుగుజ్జుగా మన బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్

బాలీవుడ్ టాప్ హీరోలో ఒకరు షారూక్ ఖాన్. ఇటీవలే ఫ్లాఫ్ సినిమాలు ఎక్కువడంతో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.  చిలిపిదనం,కొంటెదనం కలగలిసిన పాత్రలకి కేరాఫ్ అడ్రెస్ గా షారూక్ ఖాన్  కనిపిస్తారు. ఈ సారి తన స్టార్ డమ్ కి తగిన హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. అందువలన ఢిపారెంట్ రోల్స్ చేయడానికి షారూక్ ఆసక్తిని కనబరుస్తున్నారు. అలాంటి పాత్రలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. 
ఇటీవలే డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ కి షారూక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో షారూక్ మరుగుజ్జు పాత్రలో కనిపించనున్నారట. 'విచిత్ర సోదరులు'లో కమల్ పాత్ర తరహాలో కనిపిస్తారన్న మాట. ఐతే ఆ స్టోరీకీ .. ఈ షారుక్ నటించబోయే ఫిల్మ్ కి ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమాలో షారూక్ పక్కన హీరోయిన్లుగా  కత్రినా కైఫ్ ను,అనుష్క శర్మను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com