రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి

- June 03, 2017 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి

ఏడేళ్ళ బాలిక, రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. సదరన్‌ గవర్నరేట్‌ పరిధిలోని బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, విదేశీ జంట కుమార్తె అయిన ఏడేళ్ళ బాలిక, చిన్న రేసింగ్‌ వాహనాన్ని తల్లిదండ్రులకు తెలియకుండా రోడ్డు మీదకు తీసుకొచ్చింది. మెటల్‌ బారియర్‌లోకి ఆ వాహనం దూసుకుపోవడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే, తమ బృందం అక్కడికి చేరుకుందని, బాలికను ఆసుపత్రికి తరలించగా మృతి చెందిందని సదరన్‌ గవర్నరేట్‌ పోలీస్‌ జనరల్‌ డైరెక్టర్‌ కల్నల్‌ ముబారక్‌ అల్‌ మెర్రి చెప్పారు. చట్ట పరమైన ప్రొసీడింగ్స్‌ అనంతరం కేసుని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి రిఫర్‌ చేయడం జరుగుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com