మాదక ద్రవ్యాల వ్యాపారి అరెస్టు
- June 03, 2017మనామా : ఒక కిలోగ్రాము గంజాయితో దొరికిపోయిన ఆసియా దేశానికి చెందిన మాధకద్రవ్యాల చిరు వ్యాపారిని శుక్రవారం అరెస్టు చేసినట్లు భద్రతా అధికారులు ప్రకటించారు. నేర పరిశోధన మరియు ఫోరెన్సిక్ సైన్స్ జనరల్ డైరెక్టర్ కల్నల్ అబుద్ధులాజిజ్ అల్ రుమేహి ఈ సందర్భంగా మాట్లాడుతూ, పట్టుబడిన ఆ నిందితుని వద్ద నార్కోటిక్ మాత్రలు అలాగే కిలో గంజాయిని కలిగి ఉన్నట్లు ధ్రువీకరించారు, ఆ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్న మాత్రల విలువ 9,200 బహెరిన్ దినార్ల విలువ చేస్తుందని అలాగే ఆ మొత్తం మాదక ద్రవ్యాల అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ముని నిందితుడు వివిధ దేశాల కరెన్సీలతో భద్రపర్చాడని పోలీసులు పేర్కొంటున్నారు. నిందితుని వద్ద ఉన్నమొత్తాన్ని జప్తు చేశారు. పట్టుబడిన నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ , నార్కోటిక్స్ నుండి ఒక వారెంట్ ద్వారా అరెస్ట్ చేశారు.ఈ కేసును విచారణ చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







