ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటున్న రాహుల్
- June 04, 2017
గుంటూరు: ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. గుంటూరులో ఏర్పాటుచేసిన ఏపీ ప్రత్యేక హోదా భరోసా సభలో ఆయన ప్రసంగించారు. 2019లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు తాము తీసుకోబోయే తొలి నిర్ణయం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించమేనన్నారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారని రాహుల్ గుర్తుచేశారు. అయితే, భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆ హామీని వాయిదా వేసిందన్నారు. హోదాతో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని, అలాంటి హక్కును సాధించుకొనేందుకు ఇక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎందుకు పోరాడటంలేదని ప్రశ్నించారు. హోదాతో కేంద్రం నుంచి వచ్చే నిధులు చంద్రబాబు, జగన్‌లకు ఎందుకు అవసరంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి డబ్బులు వస్తే ప్రభుత్వానికి మంచిదే కాదా.. మరెందుకు కేంద్రాన్ని అగడగంలేదు అని ఆయన ప్రశ్నించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







