దేవాలయాలను కాపాడుకుందాం:ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్
- June 04, 2017
ద్వారక తిరుమల వేదికగా ఈనెల 24, 25 తేదీల్లో హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సమ్మేళనానికి పలువురు మఠాలు, పీఠాల అధిపతులు హాజరవుతున్నట్లు చెప్పారు. ప్రముఖ దేవాలయాల్లో శిథిలమవుతున్న పురాతన కట్టడాలను ఎలా రక్షించుకోవాలి?, కనుమరుగువుతున్న శిలా శాసనాలను ఎలా సేకరించాలి? అనే విషయాన్ని పరిశీలించి, త్రీడీ పరిజ్ఞానంతో వాటిని రికార్డు చేసి, ఆర్కియాలజీ విభాగం ద్వారా భద్రపరచడమే ఈ సమ్మేళనం ఉద్దేశమని చెప్పారు. సోలార్ ఎనర్జీని వినియోగం, గో గ్రామాలను కాపాడుకోవడం తదితర అంశాలపై చర్చిస్తామన్నారు. ఆదివారం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గుడిలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి అతను ఎన్ని దేవాలయాలను సందర్శించారన్న దానిని గుర్తించడానికి ఐరిస్ టెక్నాలజీని ప్రతి దేవాలయంలో ఏర్పాటు చేయాలని కోరారు. దేవాలయాలను కాపాడుకోవాలన్న లక్ష్యంతో సైనికుల్లా సమ్మేళనానికి హాజరవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









