నింగిలోకి భారీ రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్ 3 డీ 1
- June 05, 2017
అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో మరోసారి చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలో త్రివర్ణపతాకాన్ని రెపరెపలాడించింది. ఇంతవరకూ అగ్రరాజ్యాలకే పరిమితం అయిన భారీ ఉపగ్రహాలను ప్రయోగించే టెక్నాలజీని అందిపుచ్చుకొంది ఇస్రో. తాజాగా ప్రయోగించిన GSLV మార్క్ 3 D1తో.. ఎంత పెద్ద ఉపగ్రహాన్నైనా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ప్రయోగించే సామర్థ్యం సాధించింది.
దాదాపు 18 ఏళ్లు శ్రమించి రూపొందించిన GSLV మార్క్ 3 D1 రాకెట్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. భారత్ ఇప్పటి వరకూ ప్రయోగించిన అంతరిక్ష నౌకల్లో ఇదే అత్యంత భారీ రాకెట్. 3వేల 136 కిలోల బరువైన జీశాట్-19 సమాచార ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. తొలిసారి ఉపయోగించిన GSLV మార్క్ 3 D1 ప్రయోగాన్ని ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. 16 నిమిషాల 20 సెకన్లలోనే జీశాట్ -19 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చింది. ప్రయోగం విజయవంతం కావడంతో.. శ్రీహరికోటలో శాస్త్రవేత్తల సంబరాలు మిన్నంటాయి.
GSLV మార్క్ 3 D1 రాకెట్ భారత అంతరిక్ష విభాగంలో అత్యంత కీలకం. ఇన్నాళ్లూ పూర్తిగా PSLVపైనే ఆధారపడిన ఇస్రో కేవలం చిన్న, నానో శాటిలైట్స్ ను మాత్రమే ప్రయోగించేది. అయితే.. భారీ ఉపగ్రహాల ప్రయోగంలో విదేశాలపై ఆధారపడేది. అయితే.. ప్రపంచ వ్యాప్తంగా 40శాతానికి పైగా జరుగుతున్న భారీ అంతరిక్ష ప్రయోగాల మార్కెట్ ను చేజిక్కించుకునేందుకు.. PSLVని మించిన GSLVని తీసుకొచ్చింది ఇస్రో. ఇప్పటికే అందుబాటులోకొచ్చిన GSLV మార్క్ 1, 2 రాకెట్లు 2వేల 500 కిలోల బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లగలవు. తాజాగా ప్రయోగించనున్న GSLV మార్క్ 3 రాకెట్ తో ఏకంగా 4వేల కిలోల బరువున్న శాటిలైట్లు ప్రయోగించగలదు.
GSLV మార్క్ 3 ప్రయోగం వల్ల ఇకపై అధిక బరువున్న ఉపగ్రహాల ప్రయోగానికి విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం మనకుండదు. ఇస్రో అందించే సేవలు చవకగా ఉండటంతో.. ఇకపై అనేక దేశాలు తమ హెవీ శాటిలైట్స్ ప్రయోగానికి భారత్ కు క్యూ కట్టడం ఖాయం. మరోవైపు.. GSLV వల్ల అంతరిక్షంలోకి వ్యోమగాములను, పర్యాటకులను తీసుకెళ్లే అవకాశం ఉండటంతో ఇది మనకు కాసులు కురిపించే వ్యాపారమే.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







