తెలంగాణాకు ఆంధ్రప్రదేశ్ నేటి నుండి విద్యుత్ సరఫరా బంద్
- June 05, 2017
విద్యుత్ సరఫరాకు సంబంధించి తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలు కొండలా పేరుకు పోవడంతో ఇక ఆ రాష్ట్రానికి కరెంటు సరఫరా చేయలేమని ఆంధ్రప్రదేశ్ తేల్చి చెప్పింది. మంగళవారం నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సోమవారం తెలంగాణ ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థలకు లేఖ రాసింది. చెల్లించాల్సిన బకాయిలు చెల్లించే వరకు విద్యుత పంపిణీని నిలిపి వేస్తున్నట్లు పేర్కొంది.
విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఉత్పత్తి అయ్యే థర్మల్ విద్యుత్ లో 53.89 శాతం తెలంగాణకు, తెలంగాణలో ఉత్పత్తయ్యే థర్మల్ విద్యుత్ లో 46.11 శాతం ఏపీకి సరఫరా జరుగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపిణీకి సంబంధించి నెలవారీ బిల్లులు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. ఇప్పటివరకు రూ. 4449 కోట్ల బకాయి రూపేణా రావలసి ఉందని ఏపీ అంటోంది.
అయితే విద్యుత్ బకాయిలకు, ఆస్తి హక్కుల పంపిణీకి ముడిపెడుతూ తెలంగాణ ప్రభుత్వం, విద్యుత సంస్థలు పైసా కూడా ఇవ్వడం లేదు. ఒక వైపు తెలంగాణ నుంచి వేల కోట్ల రూపాయిలు బకాయిలు నిలిచిపోవడంతో, బకాయిలు చెల్లించాలంటూ నెలనెలా లేఖలు పంపుతూనే ఉంది. డబ్బు చెల్లించ కుంటే విద్యుత్ సరఫరా ఆపేస్తామని ఇటీవల ఘాటుగా హెచ్చరించడం తో రూ.3149 కోట్లు రూపాయిలు తాము చెల్లించాల్సి ఉందని తెలంగాణ విద్యుత సంస్థలు లిఖితపూర్వకంగా అంగీకరించాయి. పెరిగిన ధరల కారణంగా ఏపీ 1300 కోట్లు పెంచి, 5439 కోట్లు రూపాయిలు గా చూపుతోందని వాదించాయి. ఈ వాదనను ఆంధ్ర ప్రదేశ్ తోసిపుచ్చింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది









