2016 నుండి అమలులోకి రానున్న కువైట్ న్యూ లేబర్ లా – నూతన ప్రయోజనాలు
- October 10, 2015
కువైట్ లో పని చేస్తున్న విదేశీ ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలతో రూపొందించబడిన కువైట్ నూతన శ్రామిక చట్టం 2016 నుండి అమలులోకి రానున్నది. ఈ నూతన చట్టం వలన ఉద్యోగులు పొందే ప్రయోజనాల వివరాలలోకి వెళ్తే..
* ఉద్యోగ కాంట్రాక్టు మొదలైన 9 నెలల తర్వాత 30 రోజుల యానువల్ హాలిడేస్ ను, కాంట్రాక్టు పూర్తయిన తర్వాత ఉచిత ఫ్లైట్ టికెట్ ను ఇవ్వవలెను
* ఉద్యోగికి, యజమానికి మధ్య సత్సంబంధాలను క్రమబద్దీకరించి, ఇరువర్గాలకు సంబంధించిన అన్నీ హక్కులకు తగిన హామీ ఇవ్వడమే కువైట్ నూతన శ్రామిక చట్టం సారాంశం అని ఒక పత్రిక పేర్కొన్నది.
* నూతన చట్టం ప్రకారం ఉద్యోగి తన యానువల్ హాలిడేస్ ను 2 సంవత్సరాల వరకు వాయిదా వేసుకునే అనుమతిని, యజమాని నుండి ఉద్యోగికి చేకూరవలసిన అన్నీ రకాల ప్రయోజనాలను ఆలస్యం లేకుండా పొందవచ్చును.
* ఉద్యోగికి 100 రోజుల ప్రొబేషన్ పీరియడ్ ను ఏర్పాటు చేసి, ఆ ఉద్యోగి అర్హతను, పనితనాన్ని బట్టి, యజమాని జాబ్ కాంట్రాక్టు పీరియడ్ ను ఖచ్చితంగా నిర్ణయించుకునే అవకాశాన్ని ఇస్తుంది.
--శాలెం బాబు (అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







